- Home
- Entertainment
- చైతు, సుమంత్ హీరోయిన్లని పెళ్లి చేసుకున్నది అందుకే.. విడాకులకు కారణం ఇదే, అక్కినేని ఫ్యామిలీ నుంచి తొలిసారి
చైతు, సుమంత్ హీరోయిన్లని పెళ్లి చేసుకున్నది అందుకే.. విడాకులకు కారణం ఇదే, అక్కినేని ఫ్యామిలీ నుంచి తొలిసారి
నాగ చైతన్య, సమంత విడాకుల గురించి నాగ సుశీల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున, నాగ చైతన్య, సుమంత్ హీరోయిన్లని పెళ్లి చేసుకోవడంపై కూడా ఆమె మాట్లాడారు.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నారు. చైతు చివరగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నాగ చైతన్య.. కార్తీక్ దండు దర్శకత్వంలో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. నాగార్జున సోదరి, నాగ చైతన్య మేనత్త నాగ సుశీల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగ చైతన్య, సమంత విడాకుల గురించి నాగ సుశీల తొలిసారి స్పందించారు. చైతు, సమంత విడిపోయినప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంతగా స్పందించలేదు. వీరిద్దరి విడాకులకు గల కారణాల గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలిలో మహిళలే కీలకం అవుతున్న విషయాన్ని నాగ సుశీల వివరించారు. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అమల అక్కినేని.. అన్నపూర్ణ కాలేజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నాన్నగారు అమ్మగారి పేరు మీదే అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించిన విషయాన్ని సుశీల గుర్తు చేసుకున్నారు.
నాగార్జున లాగే నాగ చైతన్య, సుమంత్ కూడా నటులే. వారంతా తమ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. ఒకే రంగంలో ఉన్నారు భార్య భర్తలు అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే వీలు ఉంటుంది. కానీ నాగ చైతన్య, సుమంత్ విషయంలో అలా జరగలేదు. నాగ చైతన్య, సమంత విడిపోయిన విషయాన్ని సుశీల గుర్తు చేసుకున్నారు. సుమంత్ కి కూడా హీరోయిన్ కీర్తి రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా విడిపోయారు. ఇటీవల నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. ఈసారి కూడా చైతు హీరోయిన్ నే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాలతో ప్రేమలో పడ్డ చైతు గతేడాది ఆమెని వివాహం చేసుకున్నారు.
విడాకులు అనేవి సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లో కూడా చాలా ఉన్నాయి. విడాకుల విషయంలో మూడో వ్యక్తిని నిందించడానికి లేదు. ఎందుకంటే ఎందుకంటే భార్య భర్తల మధ్య జరిగిన విషయాలే విడాకులకు కారణం అవుతాయి. ఇతరులు కూడా భార్య భర్తల మధ్య జరిగిన విషయాలని కామెంట్ చేయడానికి లేదు. కుదిరితే భార్య భర్తలు అడ్జెస్ట్ కావడానికి ప్రయత్నించాలి.
జీవితాంతం బాధపడుతూ, గొడవలు పడుతూ ఉండడం కంటే కొన్నిసార్లు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు జీవించడం మంచిది అని నాగ సుశీల అన్నారు. మా ఫ్యామిలీలో పిల్లలు అంతా నన్ను అత్తమ్మ అని కానీ పిన్ని అని కానీ పిలవరు.. నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుప్రియ ఇలా ప్రతి ఒక్కరూ సుశీలమ్మ అని పిలుస్తారు. ఆ పిలుపులో నాకు ఎంతో ప్రేమ కనిపిస్తుంది అని నాగ సుశీల తెలిపారు.