సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చే ఆలోచనలో నయనతార, కారణం ఏంటంటే..?
వరుస వివాదాలతో చికాకుల్లో ఉంది స్టార్ హీరోయిన్ నయనతార. ఒకటి పోతే మరోసమస్యలో ఇబ్బంది పడుతుంది. ఈక్రమంలోనే ఆమె అన్నింటికి పుల్ స్టాప్ పెట్టే విధంగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి కాస్త సైడ్ అవుతామనుకుంటుందట సీనియర్ బ్యూటీ.
గత కొద్ది కాలంగా వివాదాలతో సహవాసం చేస్తోంది సీనియర్ బ్యూటీ నయనతార. ఒక సమస్య పోతే మరో సమస్య నయన్ కు నిద్ర లేకుండా చేస్తోంది. దాంతో జీవితంలో ప్రశాంతత లేకుండా ఉక్కిరిబిక్కిరి అవుతుంది నయనతార. దాంతో ఆమె వీటికి దూరంగా ఉండాలని చూస్తోందట.
Nayanthara
షారుఖ్ ఖాన్ సరసన నయన్ నటిస్తున్న జవాన్ సినిమా తుది దశకు చేరుకుంది.ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది పూర్తి చేశాక నయనతార మాధవన్ హీరోగా నటిస్తున్న ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈలోగా సినిమాలు, ఎండార్స్‌మెంట్స్ ఏవీ ఒప్పుకోవద్దని ఆమె అనుకుంటున్నది.
పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ వస్తోన్న నయనతార..ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి.. కాస్త విరామం తీసుకుందామని భావిస్తుందట తమిళ హీరోయిన్. అన్నింటికి దూరంగా ఉండాలని భావిస్తుందట నయన్. ఈ నెల 18న ఆమె పుట్టినరోజును కూడా హడావుడి లేకుండా భర్త, పిల్లలతోనే గడపాలని నయన్ అనుకుంటుందట.
పెళ్లి తరువాత సరోగసి ద్వారా కవల పిల్లల్ని కన్నఈ హీరోయిన్.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. భర్త పిల్లలతో కలిసి లైఫ్ ను కొన్నాళ్లు హ్యాపీగా లీడ్ చేయాలని చూస్తుందట. దీని కోసం అన్నింటికి దూరంగా ఉంటూ.. కామ్ గా లో ప్రోఫైల్ మెయింటేన్ చేయాలని ప్లాన్ చేస్తుందట.
Heroines Onam Looks
నయనతార పెళ్లికి ముందు పెళ్ళి తరువాత వరుస వివాదాలు ఫేస్ చేసింది. పెళ్ళికి మందు ప్రేమ వ్యావహారాలతో చాలా చికాకులు ఫేస్ చేసింది నయనతార. శింబు, ప్రభుదేవ వల్ల అనవసరంగా రచ్చకెక్కింది. ఇక అన్నిసమస్యలు దాటు కుంటూ వస్తున్న సమయంలో.. మానసిక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేసింది. అవన్నీ దాటుకుని ధైర్యంగా అడుగులు వేసింది సీనియర్ బ్యూటీ..
ఇక దాదాపు ఐదేళ్ళు తనకంటే చిన్నవాడైన దర్శకుడు విఘ్నేష్ తో డేటింగ్ చేసి..రీసెంట్ గా పెళ్ళాడిన నయనతార.. పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుందో తెలిసిందే. పెళ్లితోనే ఈ అమ్ముడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టైంలో పెళ్లి ఫొటోస్ బయటకు రానివ్వకుండా నానా రచ్చ చేసి సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా ట్రోల్ అయింది .
নয়নতারা
ఇక పెళ్లి కుదిరిన తరువాత తర్వాత తిరుములలో ఫోటో షూట్ చేసి.. వివాదం అయ్యింది. పెళ్లి తరువాత కాళ్లకు చెప్పులు వేసుకుని హిందూ సాంప్రదాయాలను పట్టించుకోకుండా బిహేవ్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది.ఇలాంటి కోకోల్లలు వివాదాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.