ప్రభాస్ పై నయనతార ఫన్నీ కామెంట్స్.. ఎన్టీఆర్, రవితేజను కూడా వదల్లేదుగా!
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) నటించిన చిత్రం ‘కనెక్ట్’. ఈ చిత్ర ట్రైలర్ ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. అయితే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటు టాలీవుడ్ హీరోలపై నయనతార చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ హీరోయిన్ గా సౌత్ ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన నటించి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలతో హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది నయనతార. 20 ఏండ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గకుండా ముందుకెళ్తోంది. 2022లో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసింది.
పెళ్లి తర్వాత నయనతార కేరీర్ లో మరింత స్పీడ్ పెంచింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం హార్రర్ ఫిల్మ్ ‘కనెక్ట్’ Connectతో రాబోతోంది. ఈ చిత్రం రేపే (డిసెంబర్ 22) తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఆడియెన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజపై ఫన్నీ కామెంట్స్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో నయనతార ‘యోగి’ చిత్రంలో నటించింది. అయితే అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ ఏం మారలేదని. ఆయనది పిల్లాడి మనస్థత్వమని తెలిపింది. ప్రభాస్ అల్లరిని తట్టుకోవడం కష్టమని చెప్పుకొచ్చింది. అలాంటి ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం సంతోషంగా ఉందని తెలిపింది. ఇక నయనతార ‘కనెక్ట్’ మూవీ ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా చాలా సెట్స్ లో చాలా హుందాగా, జాలీగా ఉంటారని తెలిపింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని, రిహార్సల్ లేకుండా షూట్ కు వెళ్లడం గొప్పవిషమన్నారు. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక్కరే ఉన్నారని తెలిపింది. సూపర్ టాలెంటెడ్ అంటూ పొగిడేసింది. ఇక రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితో ఎప్పుడూ హిందీలో మాట్లాడుతూ ఉంటానని తెలిపింది. బాలక్రిష్ణతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఫీలింగ్ అని తెలిపింది.
చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార టాలీవుడ్ స్టార్స్ పై ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘కనెక్ట్’ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని భావించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. గంటన్నర నిడివి గల ఈ చిత్రానికి అశ్విన్ సరవరన్ దర్శకత్వం వహించారు. విఘ్నేశ్ శివన్ నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలను పోషించారు.