నయనతార మూవీ కెరీర్ కు 20 ఏళ్లు, లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్..
ఇండస్ట్రీలో స్టార్ డమ్.. భారీ రెమ్యూనరేషన్, లగ్జరీ లైఫ్.. కోట్లలో ఆస్తి.. ఏ హీరోయిన్ కు లేని డిమాండ్.. ఇలా నయనతార గురించి చెప్పాలంటే చాలా ఉంది. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నయనతార గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..?

కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార అరుదైన రికార్డ్ సాధించింది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కాని హీరోయిన్ అంటే కొన్నేళ్ళ వరకూ కెరీర్ .. ఆ తరువాత ఎంత పెద్ద తార అయినా.. కనుమరుగు అవ్వాల్సిందే. కాని ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం లాంగ్ టైమ్ కెరీర్ ను కొనసాగిస్తుంటారు.వారిలో నయనతార కూడా ఒకరు. తారలు పది పదిహేనేళ్లు కెరీర్ ను కొనసాగించడం చాలా ఎక్కువ. అటువంటిది 20 ఏళ్లగా ఫిల్మ్ ఇండస్ట్రీని.. మరీ ముఖ్యంగా తమిళ పరిశ్రమను ఏలుతోంది నయనతార్, అంతే కాదు మునిపటికంటే ఎక్కువ డిమాండ్ తో.. కోట్లు వసూలు చేస్తూ.. హీరోయిన్ గా కొనసాగుతోంది.
Nayanthara
చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నయనతార . ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు సాధిసతూ.. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ముఖ్యంగా ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్... వెంకటేష్, చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించి మెప్పించింది నయనతార.
నయనతార కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా చంద్రముఖి. ఈసినిమాలో రజనీకాంత్ జోడిగా నటించిన తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది నయనతార. వెంటనే టాలీవుడ్ లోకూడా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో వరుసగా లక్ష్మీ, యోగి, దుబాయ్ శీను, సింహం ఇలా అన్ని హిట్ సినిమాలే చేసుకుంటూ వెళ్లింది బ్యూటీ.
నయనతార ఈ స్టేజ్ కు రావడం కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నయన్ అసలు పేరు డయానా మరియన్ కురియమ్. కెరీర్ బిగినింగ్ లో మనసీనక్కరే సినిమాలో నటించింది బ్యూటీ. కాని ఈమూవీ ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. అయితే ఈ సినిమా దర్శకుడు డయానా అనే పేరు నచ్చక.. ఒక రోజంతా ఆలోచించి నయనతార అనే పేరు పెట్టాడు. ఆపేరే ఆమెకు కలిసి వచ్చింది. స్టార్ హీరోయిన్ అయ్యింది.
Nayanthara Controversy
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే నయనతార ఎక్కువ డిమాండ్ చేస్తోంది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ముందు వరుసలో ఉంది. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ నయనతార స్టార్ డమ్ లో ఏమాత్రం మార్పులేదు. అంతే కాదు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయన్ కు రికార్డ్ ఉంది. ఈ ఏజ్ లో కూడా సినిమాకు 15 కోట్లు వరకూ ఆమె డిమాండ్ చేస్తోంది.
వరుస సినిమాలతో నటనతో తన సత్తా చాటుకుంది నయనతార. ఆమె ఇమేజ్, పేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. కోట్ల రూపాయల్లో డబ్బు కూడా సంపాదించుకుంది బ్యూటీ. దాదాపు ఇండస్ట్రీలోని లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తూ డిసెంబర్ 25తో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుంది.నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన అన్నపూరణి డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నయనతార. ఆమె ఒక స్టార్ హీరో ఇమేజ్ కు సమానంగా స్టార్ డమ్ ను సాధించింది. అందుకే సౌత్ లో విజయశాంతి తరువాత నయనతారను లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తారు. గ్లామర్ పాత్రలతో అలరించిన నయనతార.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా అదరగొట్టింది.
Simbu and Nayanthara
నయనతార ఎంత డబ్బు సంపాదించినా..? ఎంత స్టార్ డమ్ వచ్చినా.. ఆమె జీవితంలో అన్ని కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఫేస్ చేసింది. హీరో శింబు తో ప్రేమలో పడింది.. అతని చేతిలోమోసపోయింది.. ఆతరువాత రెండో సారి స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవ ను ప్రేమించింది. పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైమ్ కు.. పెద్ద వివాదంగా మారి.. ఆపెళ్లి కూడా ఆగిపోయింది. దాంతో ఆమె మానసికంగా చాలా బాధలు పడింది నయన్.
చివరకు యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో దాదాపు ఐదేళ్లు ప్రేమించి.. అతనితో డేటింగ్ చేసి గతేడాది పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యింది. ప్రస్తుతం అటు సినీ జీవితం, పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నయనతార. జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈసినిమాలో షారుఖ్ ఖాన్ జోడీగా నటించి అక్కడ కూడా తన సత్తా చాటుకుంది.
nayanthara
ఇక నయన్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆమె కూడబెట్టినట్టుగా కోట్లు ఏ హీరోయిన్ సంపాదించలేదనేది ఇండస్ట్రీ టాక్. ఓ ప్రైవేట్ ప్లైట్ ను కూడా మోయింటేన్ చేస్తుందటే ఆమె ఆస్తులు గురించి ఇంతకంటే ఏం చెపుతాం. చెన్నై, హైదరాబాద్, కేరళలో ఇళ్ళు.... లగ్జరీ కార్లు, భారీగా స్థాలలో అందరికి షాక్ ఇస్తాంది బ్యూటీ. నయన్ కు సినిమాలే కావు.. సొంతంగా బిజీనెస్ లు కూడా ఉన్నాయి.