- Home
- Entertainment
- క్యూట్ సెల్ఫీలతో మెస్మరైజ్ చేస్తున్న చైతూ హీరోయిన్.. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటున్న దక్షనాగర్కర్
క్యూట్ సెల్ఫీలతో మెస్మరైజ్ చేస్తున్న చైతూ హీరోయిన్.. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటున్న దక్షనాగర్కర్
యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) క్యూట్ లుక్స్ తో అదరగొడుతోంది. ఇటీవల నాగచైతన్యతో కలిసి నటించిన దక్ష టాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ముంబయి బ్యూటీ దక్ష నాగర్కర్ అందాల విందుతో అదరహో అనిపిస్తోంది. వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. నటన పరంగా ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి ఈ బ్యూటీ. దీంతో గ్లామర్ పరంగానూ రెచ్చిపోతోంది.
దక్ష నాగర్కర్ తన కేరీర్ ను మోడల్ గా స్టార్ట్ చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకున్న దక్ష తొలుత తెలుగు ఫిల్మ్ ‘ఏకే రావు పీకే రావు’లో నటించింది. ఆ తర్వాత హోరా హోరీ, హుషారు, జాంబిరెడ్డి తో ఆకట్టుకుంది.
నటన పరంగా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈ బ్యూటీకి అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘బంగార్రాజు’ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది . ఈ మూవీలో దక్ష అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సరసన నటించి ఆకట్టుకుంది.
ఈ మూవీలో దక్ష కొద్ది సేపు మాత్రమే కనిపించినా చైతూకు ధీటు పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఆ వెంటనే అదిరిపోయే సాంగ్ లోనూ గ్లామర్ స్టెప్పులేసి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఒకరకంగా ఈ మూవీ దక్షకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఈ చిత్రం తర్వాత దర్శక నిర్మాత చూపు ఈ బ్యూటీపై పడింది.
‘బంగార్రాజు’ తర్వాత వెంటనే మాస్ మహారాజ రవితేజ మూవీలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ‘రావణసూర’లో ఓ స్పెషల్ రోల్ లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటు గ్లామర్ పరంగానూ మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా క్యూట్ సెల్ఫీ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ లో బెడ్ పై పడుకొని సెల్ఫీలకు ఫన్నీగా ఫోజులిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే ఎప్పుడో చెప్పాలంటూ ఈ పిక్స్ ను షేర్ చేసుకుంది. నెటిజన్లు కూడా ఆమె పిక్స్ ను లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.