- Home
- Entertainment
- Nabha Natesh: రెట్రో లుక్ లో నభా నటేష్ పిచ్చెక్కించే గ్లామర్... సరికొత్త అందాలతో మైమరిపిస్తున్న భామ!
Nabha Natesh: రెట్రో లుక్ లో నభా నటేష్ పిచ్చెక్కించే గ్లామర్... సరికొత్త అందాలతో మైమరిపిస్తున్న భామ!
heroine nabha natesh mesmerizes in retro look latest photos goes viral ksr నభా నటేష్ హాలోవీన్ మూడ్ లో ఉన్నారట. అందులో భాగంగా రెట్రో లుక్ ట్రై చేసింది. నభా లుక్ సరికొత్తగా తోస్తుంది. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Nabha Natesh
నభా నటేష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. దర్శకులెవరూ ఆమెను పట్టించుకోవడం లేదు. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా రెట్రో లుక్ లో అదరగొట్టింది. నభా గ్లామర్ నెటిజెన్స్ కి గిలిగింతలు పెట్టేలా ఉంది.
Nabha Natesh
వరుస పరాజయాలు నభా నటేష్ కెరీర్ దెబ్బతీశాయి. 2021లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే ఆఫర్స్ రాక కాదు, ప్రమాదం వలన విశ్రాంతి తీసుకున్నానని నభా నటేష్ చెబుతున్నారు. ఓ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు ఆ మధ్య వెల్లడించారు.
Nabha Natesh
ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది. అయితే తర్వాత మళ్ళా ప్లాప్స్ పడ్డాయి.
Nabha Natesh
కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తెలుగులో నభా నటేష్ జోరు తగ్గగా... కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతున్నారు. ముఖ్యంగా శ్రీలీల క్రేజీ ఆఫర్స్ తో సత్తా చాటుతుంది.
Nabha Natesh
నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా టాలీవుడ్ లో అడుపెట్టింది. అనంతరం రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అదుగో లో నటించింది. మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ లో రెండో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాతో హిట్ టాక్ ఎక్కింది.
Nabha Natesh
అనంతరం నభా నటేష్ నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లు అదుర్స్ మరో ప్లాప్ గా నిలిచింది. మ్యాస్ట్రో మూవీపై ఆశలు పెట్టుకుంటే అది నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక నభా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...