Nabha Natesh: చూపులతో చంపేస్తున్న నభా నటేష్... ఎవరి కోసం ఈ ఎదురు చూపులు?
సాంప్రదాయ చీర కట్టులో పద్దతిగా కనిపించింది నభా నటేష్. ఆమె కళ్ళు చెప్పలేని భావాలు పలికిస్తున్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఆ భంగిమలు ఉన్నాయి.

Nabha Natesh
నిండుగా తయారైన నభా నటేష్ ప్రియమైన వారి కోసం ఎదురు చూస్తున్న భావన కలిగించింది. అరాకొరా బట్టల్లో స్పైసీగా కనిపించే కన్నడ భామ చీరకట్టులో మైమరిపించింది. నభా నటేష్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.
Nabha Natesh
వరుస పరాజయాలతో అనూహ్యంగా నభా ఫేడ్ అవుట్ దశకు చేరింది. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. దాంతో అది ఆమెకు కెరీర్ కి ఉపయోగపడలేదు.
Nabha Natesh
అయితే గ్యాప్ రావడానికి అనారోగ్య సమస్యలే కారణమంటూ ఆ మధ్య నభా నటేష్ వివరణ ఇచ్చారు. నభా నటేష్ ప్రమాదం బారిన పడ్డారట. ఆ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
Nabha Natesh
ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది.
Nabha Natesh
ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది.
Nabha Natesh
కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తెలుగులో నభా నటేష్ జోరు తగ్గగా... కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతున్నారు. ముఖ్యంగా శ్రీలీల క్రేజీ ఆఫర్స్ తో సత్తా చాటుతుంది.
Nabha Natesh
ఆఫర్స్ కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది నభా నటేష్. సోయగాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తుంది. నభా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.
Nabha Natesh
ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో పూరి జగన్నాథ్-రామ్ పోతినేని సినిమా చేస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నేటి నుండి షూటింగ్ జరగనుంది.
Nabha Natesh
డబుల్ ఇస్మార్ట్ మూవీలో హీరోయిన్స్ ని ఇంకా ప్రకటించలేదు. నభా ప్రయత్నం చేస్తే కనీసం సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కే ఆస్కారం కలదు. నభాకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చిత్రాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు.
Nabha Natesh
సాంప్రదాయ చీర కట్టులో పద్దతిగా కనిపించింది నభా నటేష్. ఆమె కళ్ళు చెప్పలేని భావాలు పలికిస్తున్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఆ భంగిమలు ఉన్నాయి.