Mrunal Thakur: కోటు బటన్స్ తీసేసిన మృణాల్ ఠాకూర్... ఆ వల కూడా అడ్డు లేకుంటే పరిస్థితి ఏంటీ?
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ స్కిన్ షోలో హద్దులు చెరిపేస్తుంటే టాలీవుడ్ ఆడియన్స్ అవాక్కవుతున్నారు. సీతారామం హీరోయిన్ ఇంత హాటా అని చర్చించుకుంటున్నారు.
Mrunal Thakur
నార్త్ బ్యూటీ మృణాల్ ని టాలీవుడ్ కి తెచ్చాడు దర్శకుడు హను రాఘవపూడి. తెలుగులో ఆమె మొదటి చిత్రం సీతారామం. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
Mrunal Thakur
సీత పాత్రలో మృణాల్ చెరగని ముద్ర వేశారు. ఆమె పాత్రలోని షేడ్స్ కొత్త అనుభూతి పంచాయి. హిందీలో కూడా మెరుగైన వసూళ్లు రాబట్టింది. వస్తూ వస్తూనే మృణాల్ అద్భుతం చేసింది. ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
Mrunal Thakur
నేచురల్ స్టార్ నానికి జంటగా హాయ్ నాన్న టైటిల్ తో ఒక మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హాయ్ నాన్న డిసెంబర్ 21న విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది.
Mrunal Thakur
అలాగే విజయ్ దేవరకొండతో మరొక చిత్రం ప్రకటించారు. విజయ్ దేవరకొండ 13వ చిత్రంగా తెరకెక్కుతుండగా దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. తాజాగా షూటింగ్ మొదలైంది. 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Mrunal Thakur
కాగా మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు.మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ రాబట్టారు.
Mrunal Thakur
వెండితెర ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో అవమానాలు ఎదురయ్యాయని మృణాల్ గతంలో చెప్పారు. మట్టి కుండ మాదిరి నల్లగా ఉన్నావు అనేవారట. మట్కా(కుండ) అని నిక్ నేమ్ కూడా పెట్టారని మృణాల్ ఆవేదన చెందారు. సీరియల్ నటి అనగానే తక్కువ భావనతో చూసేవారు. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుండి తప్పించారంటూ ఆమె వేదన చెందారు. ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయ్యారు.