- Home
- Entertainment
- రాజ్ తరుణ్ తో ముద్దులు,హగ్గులు, బెడ్ రూమ్ సీన్స్ పై.. స్పందించిన హీరోయిన్, ఏమంటుందంటే..?
రాజ్ తరుణ్ తో ముద్దులు,హగ్గులు, బెడ్ రూమ్ సీన్స్ పై.. స్పందించిన హీరోయిన్, ఏమంటుందంటే..?
ప్రస్తుతం ఓ కేస్ లో ఇబ్బందిపడుతున్నాడు తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్. తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఈహీరోపై కంప్లైంట్ ఇచ్చింది. కాగా ఈక్రమంలో రాజ్ తరుణ్ జోడీగా నటించిన ఓ హీరోయిన్ అతనితో రొమాంటిక్ సీన్స్ పై స్పందించింది.

టాలీవుడ్ యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఆతరువాత కుమారీ 21ఎఫ్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. కాని ఆతరువాత కథ సెలక్షన్ లో పొరపాట్లు, కెరీర్ పై నిర్లక్ష్యంతో మంచి మంచి అవకాశాలు చేజార్చుకున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో బాగా వెనకబడ్డాడు రాజ్ తరుణ్.
Raj Tarun
ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. అవి పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో రాజ్ తరుణ్ కు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ పై కాస్త నెగెటీవ్ భావన వచ్చింది. అంతే కాదు కొన్ని సంఘటనలు కూడా రాజ్ తరుణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాగా రాజ్ తరుణ్ పై తాజాగా ఓ యువతి కంప్లైయింట్ ఇవ్వడంతో అది పెద్ద ఇష్యూగా మారింది. తనను నమ్మించి మోసం చేశాడంటూ నవ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది.
Raj Tarun
అయితే ఆమెపై రివర్స్ అటాక్ చేశాడు రాజ్ తరుణ్. తానే డ్రగ్స్ తీసుకుని తనను హింసించిందని.. తనను ప్రతీ నిమిషం టార్చర్ చేసిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. దాంతో ఆహెను సాక్ష్యలు అడుగుతూ..పోలీసులు రివర్స నోటీసులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ఇష్యు నడుస్తుండగానే.. ఆయనకు సబంధించిన సినిమా హడావిడి కూడా స్టార్ట్ అయ్యింది.
రాజ్ తరుణ్ హీరోగా సీనియర్ దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఓ సినిమాను తెరకెక్కించారు. తిరగబడరాసామీ టైటిల్ తో రూపొందిన ఈమూవీని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించాయి.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా మాల్వి మల్హోత్రా నటించగా.. ఆమె ఈసినిమా ద్వారా బాగా హైలెట్ అయ్యింది. ఈసినిమాతో రాజ్ తరుణ్ తో ఘాటు రొమాన్స్ ను పండించింది బ్యూటీ. రాజ్ తరుణ్ తో ముద్దులు, బెడ్ రూమ్ సీన్స్ లో ఓ రేంజ్లో రెచ్చిపోయి నటించింది. అయితే ఈసిన్స్ గురించి తాగాజా స్పందించింది హీరోయిన్.
తిరగబడరాసామీ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది మాల్వి. అయితే రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్స్ లో హీరో రాజ్ తరుణ్ తో ఈమె బోల్డ్ సీన్స్ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమా కథలో భాగంగా లిప్ లాక్ సీన్స్,లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి.మొదట్లో ఆ సీన్స్ చేయడానికి టెన్షన్ వచ్చింది. కానీ హీరో రాజ్ తరుణ్ నన్ను అర్థం చేసుకుని .. నాకు నా స్పేస్ ఇచ్చారు. వాటి గురించి చెబితే కథలో మెయిన్ ట్విస్ట్ కూడా కూడా రివీల్ అయిపోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.