MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • లయ తీరని కోరిక ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆ అసంతృప్తి.. ఆ సూపర్‌ స్టార్‌ కరుణిస్తాడా?

లయ తీరని కోరిక ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆ అసంతృప్తి.. ఆ సూపర్‌ స్టార్‌ కరుణిస్తాడా?

ఒకప్పటి హీరోయిన్‌ లయ ఇప్పుడు `తమ్ముడు` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా తనలో ఉన్న తీరని కోరికని బయటపెట్టింది. తాను దాని కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2025, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`తమ్ముడు` సినిమాతో నటి లయ రీఎంట్రీ
Image Credit : laya insta

`తమ్ముడు` సినిమాతో నటి లయ రీఎంట్రీ

సీనియర్‌ హీరోయిన్‌ లయ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆమె మూవీస్‌కి దూరమయ్యింది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో బలమైన పాత్రలు పోషించేందుకు రెడీ అవుతుంది. 

తాజాగా ఆమె `తమ్ముడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. నితిన్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ త్వరలోనే(జులై 4) ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

లయ `తమ్ముడు` చిత్రంలో అక్క పాత్రలో నటిస్తోంది. ఝాన్సీ కిరణ్మై పాత్రలో నితిన్‌కి అక్కగా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తోంది.

 యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. నితిన్‌ చాలా ఏళ్ల తర్వాత హిట్‌ కొట్టబోతున్నాడనే హింట్‌ ని ఈ చిత్రం ఇస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే ఇందులో లయ పాత్ర బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవితో నటించలేకపోవడం లయ తీరని కోరిక
Image Credit : Asianet News

చిరంజీవితో నటించలేకపోవడం లయ తీరని కోరిక

ఈ క్రమంలో `తమ్ముడు` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, ఆమె పలు మీడియా సంస్థలతో ముచ్చటించింది. ఇందులో తన విష్‌ వెల్లడించింది. అదే సమయంలో తనలో ఉండిపోయిన ఓ కోరికని బయటపెట్టింది లయ. 

తనకు చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక ఉండేదట. తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు బాగా కోరుకుందట. ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్‌ నుంచి వస్తారు, హీరోయిన్‌గా రాణిస్తారు. స్టార్‌గా ఎదుగుతారు. సక్సెస్‌ని బట్టి వారి రేంజ్‌ పెరుగుతుంది. 

తాను కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఒక స్టేజ్‌కి వచ్చాక మరో స్టేజ్‌కి వెళ్లాలనుకుంటాం. అలా మిగిలిన చాలా మంది హీరోలతో నటించాను. కానీ చిరంజీవితో వర్క్ చేయలేదు. ఆయనతో సినిమా చేయాలని చాలా ఉండేది. కానీ ఆ కోరిక తీరలేదు. 

ఆయనతో సినిమా చేయలేకపోయాననే వెలితి అలానే ఉండిపోయింది. ఆ అసంతృప్తి ఇప్పటికీ ఫీలవుతుంటానని చెప్పింది లయ. అయితే ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే ఆయనతో సినిమా చేయాలని ఉందని వెల్లడించింది. ఆయనతో చేస్తే తనకు ఒక సంతృప్తి కలుగుతుందని వెల్లడించింది. 

మరి తన కోరిక చిరంజీవి వరకు వెళ్తుందా? మేకర్స్ ఆమెకి చిరంజీవి చిత్రాల్లో ఆఫర్‌ చేస్తారా? అనేది చూడాలి. ఇది సినిమా పరిశ్రమ ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. దర్శకులు తలుచుకుంటే, చిరంజీవి అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. మరి లయకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

35
కామెడీ చిత్రాలతో స్టార్‌హీరోయిన్‌గా ఎదిగిన లయ
Image Credit : laya insta

కామెడీ చిత్రాలతో స్టార్‌హీరోయిన్‌గా ఎదిగిన లయ

లయ కూడా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఆమె పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. చాలా వరకు సెకండ్‌ రేంజ్‌ హీరోలతోనే మూవీస్‌ చేసింది. శ్రీకాంత్‌, జగపతిబాబు, శివాజీ, వేణు తొట్టెంపూడి వంటి వారితో కలిసి నటించింది.

 మంచి విజయాలు అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ చిత్రాలు ఎక్కువగా చేసింది లయ. అవి మంచి విజయాలు సాధించాయి. దీంతో లయ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 

అయితే కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. అమెరికాలో సెటిల్‌ అయిన గణేష్‌ గోర్ల్టీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. అమెరికా వెళ్లిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 

ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యారు. ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీ నుంచి ఆమె కొంత రిలీఫ్‌ అయ్యింది. దీంతో మళ్లీ సినిమాలు చేస్తోంది లయ. అందులో భాగంగా `తమ్ముడు` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.

45
లయ తెలుగులో నటించిన చిత్రాలివే
Image Credit : laya insta

లయ తెలుగులో నటించిన చిత్రాలివే

తెలుగు అమ్మాయి అయిన లయ 1992లో `భద్రం కొడుకో` చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏడేళ్లకి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. 

ఈ చిత్రంతోనే అటు హీరోగా వేణు తొట్టేంపూడి, హీరోయిన్‌గా లయ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. 

`మా బాలాజీ`, `మనోహరం`, `మనసున్న మహరాజు`, `కోదండరాముడు`, `రామా చిలకమ్మా`, `హనుమాన్‌ జంక్షన్‌`, `ప్రేమించు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `నాలో ఉన్న ప్రేమ`, `కొండవీటి సింహాసనం`, `శివరామరాజు`, `నీ ప్రేమకై`, `నువ్వు లేక నేను లేను`, `పెళ్లాంతో పనేంటి`, `మిస్మమ్మ`, `నేను పెళ్లికి రెడీ`, `విజయేంద్రవర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్యా చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` వంటి కామెడీ చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది లయ.

55
గ్లామర్‌కి దూరంగా లయ
Image Credit : laya insta

గ్లామర్‌కి దూరంగా లయ

లయ నటించే సమయంలో గ్లామర్‌ కి స్కోప్‌ ఎక్కువగా ఉంది. చాలా మంది హీరోయిన్లు గ్లామర్‌ షో చేసి ఆఫర్లు అందుకున్నారు. స్టార్స్ గా ఎదిగారు. కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆమె అడుగులు వేయలేదు. నిజమైన తెలుగు అమ్మాయి అనిపించింది. 

చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించింది. సౌందర్య, ఆమని వంటి వారి తర్వాత అలా చీరలో, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. కెరీర్‌ మొత్తంలో ఆమె గ్లామర్‌కి దూరంగా ఉంది. అయినా హీరోయిన్‌గా రాణించడం విశేషమనే చెప్పాలి.

 అందుకే లయ అంటే అందరికి ప్రత్యేకమైన గౌరవం. అదే గౌరవం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇటీవల రీఎంట్రీ సందర్భంగా `తమ్ముడు` ప్రెస్‌ మీట్‌లో ఆమె ఎమోషనల్‌ అయ్యింది. 

 ఇప్పటికీ తనని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నారని, ఇంత బాగా వెల్‌కమ్‌ చెప్పడం సంతోషంగా ఉందని చెప్పింది లయ. తన భర్త, పిల్లల సపోర్ట్ తోనే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Related Stories
Recommended image1
సౌందర్య రిజెక్ట్ చేసిన మూవీతో ప్రేమలో పడ్డ స్టార్‌ కపుల్‌ ఎవరో తెలుసా? లైఫ్‌లో సెటిల్‌ కావడమంటే ఇదే మరి
Recommended image2
రాజశేఖర్‌కి పోటీగా వచ్చి డిజాస్టర్‌ అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ మూవీ ఏంటో తెలుసా? కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved