బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి , సందడి చేసిన సినీ తారలు.
మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. ఈక్రమంలో బ్యాచిలర్ పార్టీలు కూడా జోరుగా సాగుతున్నాయి.
మెగా ఇంట పెళ్ళి బాజాలు మెగబోతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్... తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెద్దలను ఒప్పించి మరీ పెళ్ళాడబోతున్నారు. వీరి పెళ్లి నవంబర్ 1న ఇటలీలో..ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరగబోతుంది. ఇప్పటికే పెళ్ళికి సబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి.
ఇటలీలో వీరి పెళ్లికి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికీ రామ్ చరణ్ ఉపాసన కూడా ఇటలీ చేరుకుని.. దగ్గరుండి పెళ్ళి పనులు చేస్తున్నారు. ఇక తాజాగా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ కూడా ఇటలీ వెళ్లారని తెలుస్తోంది. అయితే ఈ సందడి ఇలా కొనసాగుతుండగానే.. బ్యాచిలర్ పార్టీల హడావిడి కూడా గట్టిగా నడుస్తోంది. ముందుగా విదేశాల్లో వరుణ్ తేజ్ తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఘనంగా ఏర్పాటు చేశాడు.
ఆతరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ కొత్త జంట కోసం.. ప్రీ వెడ్డింగ్ పార్టీని..బ్యాచిలర్ పార్టీలకంటే గ్రాండ్ గా ఇచ్చాడు.. ఇలా మెగా ఫ్యామిలీలో వరుసగా పార్టీలు జరుగుతున్న వేళ.. అటు కాబోయే పెళ్లి కూతురు లావణ్య కూడా..తన తరపునుంచి బ్యాచిలర్ పార్టీని ఇచ్చారు. లావణ్య త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా .. బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెపుతూ.. ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీని ఇచ్చారు.
ఈ పార్టీలో ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ తో పాటు.. తన ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగాహీరో నితిన్ భార్య శాలిని, నటి రీతు వర్మ అలాగే నిహారిక ఇలా సెలబ్రిటీలంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. ఈ బ్యాచిలర్ పార్టీని గ్రాండ్ గా చేసుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోను లావణ్య త్రిపాఠి నిహారిక ఇద్దరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో ఈ పిక్స్ ఇంకాస్త కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యాచిలర్ పార్టీని లావణ్య ఇంటలీ వెళ్లే ముందు ఇచ్చినట్టు సమాచారం. ఈ పార్టీ చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో కలిసి ఇటలీ వెళ్లారని తెలుస్తోంది.
ఈ స్టార్ సెలబ్రేటీల పెళ్లి నవంబర్ ఒకటవ తేదీ జరగబోతుందని సమాచారం అయితే ఇప్పటివరకు పెళ్లి తేదీ గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం రాలేదు. మరి ఆ విషయంలో అనౌన్స్ మెంట్ ఇస్తారా..? లేక కామ్ గా పెళ్లి చేసుకుని వస్తారా అనేది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో మాత్రం ఇండస్ట్రీ వాళ్ల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది అంటున్నారు. ఈ విషయంలో కూడా క్లారిటీ రావల్సి ఉంది.