MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెమటలు చిందిస్తున్న కాబోయే పెళ్లి కూతురు లావణ్య... జిమ్ ఫిట్లో హాట్ లుక్ షేర్ చేసిన హోమ్లీ బ్యూటీ 

చెమటలు చిందిస్తున్న కాబోయే పెళ్లి కూతురు లావణ్య... జిమ్ ఫిట్లో హాట్ లుక్ షేర్ చేసిన హోమ్లీ బ్యూటీ 


త్వరలో లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలెక్కనుంది. అయినా ఫిట్నెస్ పై శ్రద్ధ వదల్లేదు. జిమ్ లో చెమటలు చిందిస్తూ కేలరీలు కరిగిస్తుంది అమ్మడు. లావణ్య జిమ్ లుక్ వైరల్ అవుతుంది . 
 

Sambi Reddy | Published : Jul 26 2023, 06:09 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Lavanya Tripathi

Lavanya Tripathi

అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన లావణ్య అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. లావణ్య సీరియల్ నటి కాగా ఆమెను దర్శకుడు హను రాఘవపూడి హీరోయిన్ చేశాడు. అందాల రాక్షసి ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. కమర్షియల్ గా ఆడకున్నా... లావణ్యకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం విష్ణుకు జంటగా నటించిన దూసుకెళ్తా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

 

27
Lavanya Tripathi

Lavanya Tripathi

బ్లాక్ బస్టర్ మూవీ మనం లో క్యామియో రోల్ చేసిన లావణ్యకు వరుసనే రెండు హిట్స్ పడ్డాయి. నానికి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్. దర్శకుడు మారుతి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. 
 

37
Lavanya Tripathi

Lavanya Tripathi

అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో మరో హిట్ కొట్టింది. దాంతో లావణ్యకు ఆఫర్స్ క్యూ కట్టాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ లావణ్య త్వర ఫేడ్ అవుట్ అయ్యింది. కేవలం పదేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా వార్తల్లో నిలిచింది. లావణ్య వరుణ్ తేజ్ భార్య కానుంది. 

 

47
Asianet Image

 జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ నాగబాబు నివాసంలో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. 

57
Asianet Image

ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. దాంతో ఎక్కడో ఓ మూలన సందేహాలు ఏర్పడ్డాయి. 

67
Lavanya Tripathi

Lavanya Tripathi

ఆగస్టు చివరి వారంలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

 

77
Lavanya Tripathi

Lavanya Tripathi

లావణ్య యాక్టింగ్ కి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. లావణ్య మాత్రం ఫిట్నెస్ కాపాడుకుంటుంది. గంటల తరబడి జిమ్ లో గడుపుతుంది. ఈ రోజుల్లో ప్రొఫెషన్, ఏజ్ తో సంబంధం లేకుండా ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారు. అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories