MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 10 లక్షలు పెడితే 10 కోట్లు వచ్చాయి, 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా ఏదో తెలుసా?

10 లక్షలు పెడితే 10 కోట్లు వచ్చాయి, 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా ఏదో తెలుసా?

కొన్ని సినిమాలు చరిత్రలో అలా నిలిచిపోతాయి. మరికొన్ని సినిమాలు కొత్త చరిత్రను రాస్తాయి. ఆ కోవలేకే వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ. సౌత్ స్టార్ హీరోకు బాలీవుడ్ లో బ్రహ్మరథం పట్టిన మూవీ ఏది?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2026, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న సినిమా భారీ విజయం...
Image Credit : instagram

చిన్న సినిమా భారీ విజయం...

ఒక సౌత్ స్టార్ హీరో.. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ మీద దండయాత్ర చేసిన సినిమా. చాలా చిన్న బడ్జెట్ తో.. భారీ విజయం సాధించిన సినిమా, అంచనాలు లేకపోయినా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా. మొదట్లో ఈ సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తి చూపించలేదట. కానీ రిలీజ్ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు ఏక్ దూజే కేలియే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కమల్ హాసన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ..
Image Credit : instagram

కమల్ హాసన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ..

కమల్ హాసన్ హీరోగా.. తొలిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సినిమా ఏక్ దూజే కేలియే. ఈ సినిమా 1981లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా.. సైలెంట్ గా వచ్చి.. బాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చిందీ సినిమా. అంతే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈసినిమా ప్రత్యేకత ఏంటంటే.. కె బాలచందర్ ఈసినిమాను డైరెక్టర్ చేశారు. సౌత్ నుంచి బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టిన ఫస్ట్ కాంబో ఇదే.

35
10 లక్షలు పెడితే 10 కోట్ల వసూలు చేసింది..
Image Credit : instagram

10 లక్షలు పెడితే 10 కోట్ల వసూలు చేసింది..

ఈ సినిమా కేవలం రూ.10 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకుంది. ఆ కాలంలో ఇది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, ఏక్ దూజే కేలియే సినిమా దాదాపు నాలుగేళ్లపాటు నాన్ స్టాప్ గా కొన్ని థియేటర్లలో నడిచినట్టు సమాచారం. ఈరకంగా ఈమూవీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

45
క్లైమాక్స్ మార్చాలని అభిమానుల గొడవ..
Image Credit : instagram

క్లైమాక్స్ మార్చాలని అభిమానుల గొడవ..

ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన రతి అగ్నిహోత్రి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నటుడు రాకేష్ బేడి కీలక పాత్ర పోషించారు. తాజాగా మ్యాషబుల్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత క్లైమాక్స్‌ను మార్చాలని ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయని ఆయన తెలిపారు. సినిమాలో హీరో, హీరోయిన్ మరణించడం క్లైమాక్స్. అయితే ఇది మార్చేయాలని ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు మరణించడం కాదు.. కలవాలని డిమాండ్ కూడా చేశారు.

55
చంపేస్తాం... అని బెదిరించారు.
Image Credit : instagram

చంపేస్తాం... అని బెదిరించారు.

రాకేష్ బేడీ మాట్లాడుతూ, ప్రేక్షకులు తన పాత్రను చాలా సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. “మేము నిన్ను చంపేస్తాం.. నువ్వే ఆ ఇద్దరినీ చంపించావు” అంటూ తనకు బెదిరింపు లేటర్స్ వచ్చేవన్నారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.‘ఏక్ దుజే కే లియే’ చిత్రం కమల్ హాసన్ బాలీవుడ్ కెరీర్‌కు బలమైన పునాది వేసిన సినిమాగా ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది. ప్రేమకథా చిత్రాల చరిత్రలో ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved