- Home
- Entertainment
- ఎట్టకేలకు లవ్ స్టోరీ బయటపెట్టిన హీరోయిన్ ఖుష్బూ.. స్వీట్ హార్ట్ అంటూ భర్తకి కాల్ చేసి లవ్ ప్రపోజ్
ఎట్టకేలకు లవ్ స్టోరీ బయటపెట్టిన హీరోయిన్ ఖుష్బూ.. స్వీట్ హార్ట్ అంటూ భర్తకి కాల్ చేసి లవ్ ప్రపోజ్
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ `జబర్దస్త్` జడ్జ్ గా సందడి చేస్తుంది. ఆమె ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ బయటపెట్టడం ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. షోలోనే ఐ లవ్యూ చెబుతూ సర్ప్రైజ్ చేసింది.

కామెడీకి కేరాఫ్‌గా `జబర్దస్త్` షో లో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ కమెడియన్లు వెళ్లిపోవడం, రోజా, మనోలు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడు ఇంద్రజ, ఖుష్బూలు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు సైతం తమదైన పంచ్‌లు, నవ్వులతో షోలని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్ సైడ్ కూడా ప్లస్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఖుష్బూ తన లవ్ స్టోరీని బయటపెట్టడం విశేషం. రాకేష్, సుజాతలు తమ స్కిట్ అనంతరం మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం అని ఖుష్బూని అడిగారు, దీంతో ఎట్టకేలకు తన ప్రేమ కథని రివీల్ చేసింది ఖుష్బూ.
దర్శకుడు,నటుడు సుందర్ సి ఖుష్బూ భర్త అనే విషయంతెలిసిందే. ఆయన దర్శకుడిగా మారి తమిళంలో రూపొందించిన తొలి చిత్రం `మురై మామన్` చిత్ర షూటింగ్ టైమ్‌లో ఖుష్బూకి ఫిదా అయ్యారట సుందర్ సి. దీంతో ఆ సినిమా టైమ్‌లోనే తనకు లవ్ ప్రపోజ్ చేశాడట. అప్పటికే ఖుష్బూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయినా ఆయన ప్రేమకి ఫిదా అయినట్టు చెప్పింది.
ఈ విషయాన్ని చెబుతూ ఖుష్బూ సిగ్గు మొగ్గేసింది. ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే దాదాపు పెళ్లై 28 ఏళ్లు అవుతుందని,ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తాను ఐలవ్ యూ చెప్పలేదని చెప్పింది ఖుష్బూ. అయితే ఇది చూసిన రాకేష్.. సరదాగా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి మేడమ్ అనడంతో , షూటింగ్ సెట్‌లోనుంచే ఫోన్ చేసింది.
ఇదిలా ఉంటే ఖుష్బూ తన ఫోన్‌లో ఆమె సుందర్ సి ఫోన్ నెంబర్‌ని `స్వీట్‌హార్ట్` అని సేవ్‌చేసుకోవడం విశేషం. ఇది చూసిన రష్మి, రాకేష్, సుజాత వంటి వారంతా హో అంటూ హోరెత్తించారు. ఇక ఎట్టకేలకు ఫోన్ చేసింది ఖుష్బూ. మరి సుందర్ సి ఫోన్ లిఫ్ట్ చేశాడా లేదా? ఆమె లవ్ ప్రపోజ్ ఫలించిందా లేదా అనేది సస్పెన్స్.
కానీ `జబర్దస్త్` హౌజ్ మొత్తం హో కొడుతూ హోరెత్తించారు. ఖుష్బూ సిగ్గులొలికిస్తూ మురిసిపోయిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోలో ఇదే మెయిన్ హైలైట్‌గా నిలవడం విశేషం. ఈ శుక్రవారం ఈ షో ప్రసారం కానున్న విషయం తెలిసింద