సాయి ధరమ్ తేజ్ తో ప్రేమలో పడ్డ కేతిక శర్మ...? హస్భండ్ మెటీరియల్ అంటూ...?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తక్కువోడు కాదు.. హీరోయిన్ల మనసు దోచస్తున్నాడు. చేసుకుంటే ఇలాంటివాడినేచేసుకోవాలి అని అనేలా చేస్తున్నాడు. ఇంతకీ మేగా మేల్లుడు ఏం మంత్రమేశాడు...

మెగా మేనల్లుడు.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఇంత మంది పెద్ద హీరోలు..హ్యాండ్సమ్ స్టార్స్ ఉన్నా..ఎక్కువ మంది హీరోయిన్లు మనసు దోచాడు హీరోగా సాయి తేజ్.. ప్రతీ హీరోయిన్ అతన్నీ.. హస్బెండ్ మెటీరియల్ అనేస్తున్నారంటే.. సాయి తేజ్ కు హీరోయిన్ల లో ఎంత మంచి పేరు ఉంది..
సాయి తేజ్ కు హీరోయిన్ల లో ఎంత మంచి పేరు ఉంది.. ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇండస్ట్రీలోని అందరితో ప్రేమగా ఉంటాడు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కలిసి పోతుంటాడు. మేగా మేనల్లుడు అన్న గర్వం లే కుండా అందరితో కలివిడిగా ఉంటాడు.
మరి సాయి తేజ్ మంచిమనసు నచ్చిందా.. లేక అతనిలో ఈగుణాలన్నీ నచ్చాయా.. తెలియదు కాని... చాలామంది హీరోయిన్లు సాయి తేజ్ ను భర్తగా హీజ్ పర్ఫెక్ట్ అంటున్నారు. ఇంతకీ ఎవరెవరు అన్నారంటే..? టాలీవుడ్ హీరోయిన్స్ అయితే సాయిధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కేతికా శర్మ సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ అనితేల్చేసింది.
ఇక ఇంతకు ముందు ఇదే మాట అన్నది లావణ్య త్రిపాటి. వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోకముందు లావణ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..వరుణ్ తేజ్ హజ్బెండ్ మెటీరియలే.. అయితే.. సాయిధరమ్ తేజ్ కూడా పర్ఫెక్ట్ హజ్బెండ్ మెటీరియల్ అంటూ కితాబు ఇచ్చింది.ఇక ఈమధ్య ఓ తెలుగు షోలో పాల్గొన్నారు కేతిక శర్మ. ఈబ్యూటీ ఇద్దరు అన్నదమ్ములతో నటించి మెప్పించింది. అటు సాయి ధరమ్ తేజ్.. ఇటు వైష్ణవ్ తేజ్ ఇద్దరితో నటించింది.
అయితే రీసెంట్ గా ఈ షోలో.. ఆమెకు ఈ ప్రశ్న ఎదురయ్యింది. మెగా బ్రదర్స్ సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరితో కలిసి కేతిక నటించారు. వీరిద్దరిలో ఎవరు హస్బెండ్ మెటీరియల్ అని ప్రశ్నించగా, కేతిక బదులిస్తూ.. సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్. కానీ ఇద్దరు బ్రదర్స్ చాలా స్వీట్. వారిద్దరికీ నేను చాలా క్లోజ్. వైష్ణవ్, నేను చిన్నపిల్లలా కొట్టుకుంటుంటాము. తేజ్‌తో అయితే చాలా డీప్ విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా సాయి ధరమ్ తేజ్ తో పని చేసిన ప్రతి హీరోయిన్హస్బెండ్ మెటీరియల్ అంటూ కితాబు ఇచ్చేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తేజ్ సినిమాలు విషయానికి వస్తే.. దర్శకుడు సంపత్ నందితో ఓ మాస్ మూవీని చేస్తున్నారు. ఆ మధ్య టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఓ కాన్సెప్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకి ‘గంజా శంకర్’ అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.