సోషల్ మీడియాను నేను సీరియస్ గా తీసుకోను... అదంతా కేవలం ఫన్ కోసమే!
జాన్వీ కపూర్ తన సినిమాలకు మించి సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారానే వార్తల్లో ఉంటారు. అలాగే ఆమె సోషల్ మీడియా అప్పీరెన్స్ కి చేసే పాత్రలకు పొంతలేకుండా ఉంటుంది. ఈ విషయంపై జాన్వీ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు.

Janhvi Kapoor
సినిమాల్లో మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలు చేస్తూ హోమ్లీ డీసెంట్ లుక్ లో కనిపిస్తున్న జాన్వీ కపూర్ కొన్ని సందేహాలకు కారణమయ్యారు. ట్రెండీ బట్టల్లో సూపర్ గ్లామరస్ గా సోషల్ మీడియాలో జాన్వీని చూసిన ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై డీసెంట్ గా చూసి డైజెస్ట్ చేసుకోవడం కష్టం అవుతుందన్న అభిప్రాయం వెల్లడించారు.
Image: Janhvi Kapoor/Instagram
ఇదే ప్రశ్న జాన్వీ కపూర్ ని అడగ్గా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. నన్ను నేను కాలిక్యులేటివ్ గా తయారు కాకుండా ప్రయత్నం చేస్తున్నాను. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన శారీలో చూసిన జనాలు చుడిదార్ లో చూసి ఇబ్బందిగా ఫీల్ కావచ్చు. కానీ అది ఒక కళ, నా వృత్తిలో భాగం, అని జాన్వీ కపూర్ అన్నారు.
Image: Janhvi Kapoor/Instagram
నేను నేనుగా వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. సినిమాల్లో కనిపించే పాత్రలకు నా నిజ స్వభావానికి తేడా ఉంటుంది. ఇక సోషల్ మీడియాను నేను సీరియస్ గా తీసుకోవడం లేదు. అది ఒక సరదా మాత్రమే అన్నారు.
సోషల్ మీడియాలో గ్లామరస్ క్యూట్ ఫోటో షూట్స్ చేయడం వలన మరికొందరు కొత్త ఫాలోవర్స్ వచ్చి చేరతారు. దాని వలన బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయం జాన్వీ కపూర్ వెల్లడించారు.
janhvi Kapoor
జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ మిల్లీ నవంబర్ 4న విడుదలైంది. సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రయోగాత్మక జోనర్ లో మిల్లీ తెరకెక్కింది. దర్శకుడు మత్తుకుట్టి జేవియర్ తెరకెక్కించారు. మిల్లీ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం.
janhvi Kapoor
2018లో దఢక్ మూవీతో జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అనంతరం ఘోస్ట్ స్టోరీస్ యంతాలజీ సిరీస్ చేశారు. గుంజన్ సక్సేనా బయోపిక్, రూహి, గుడ్ లక్ జెర్రీ చిత్రాల్లో నటించారు. ఒక భారీ కమర్షియల్ హిట్ కోసం జాన్వీ చూస్తున్నారు. తెలుగులో జాన్వీ త్వరలో ఎంట్రీ ఇచ్చే సూచనలు కలవు.
ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ పుకార్లే కాగా అధికారిక ప్రాజెక్ట్ ఖరారు కాలేదు. ఇటీవల మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీని ఎన్టీఆర్ గురించి అడగ్గా.. ఆయన లెజెండ్, గొప్ప నటుడు, ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ ఎవరు మాత్రం వదులుకుంటారు. ఖచ్చితంగా చేస్తానని జాన్వీ అన్నారు.