- Home
- Entertainment
- తొమ్మిదో నెలలో గర్భవతి ఇలియానాకు ఇబ్బందులు... ఆందోళన కలిగిస్తున్న సోషల్ మీడియా పోస్ట్
తొమ్మిదో నెలలో గర్భవతి ఇలియానాకు ఇబ్బందులు... ఆందోళన కలిగిస్తున్న సోషల్ మీడియా పోస్ట్
హీరోయిన్ ఇలియానాకు తొమ్మిదో నెల అట. నిండు గర్భవతిగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Ileana D cruz
ఇలియానా వివాహం చేసుకోకుండానే గర్భం దాల్చారు. ఓ అజ్ఞాత వ్యక్తితో సహజీవనం చేసిన ఇలియానా కడుపు పండింది. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తి ఎవరో ఇలియానా ఇంత వరకూ వెల్లడించలేదు. ఇటీవల ఆ వ్యక్తి గురించి మాట్లాడింది. ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఇలియానా అనేక విషయాలు ప్రస్తావించారు.
ఇలియానా తల్లి కావడం గొప్ప విషయమన్నారు. మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతిని పంచిందన్నారు. అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుండి బయటపడేలా చేశాడని ఇలియానా తెలిపింది. అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడని ఇలియానా అన్నారు. అయితే ఆ వ్యక్తి పేరు ఇలియానా చెప్పలేదు. లైఫ్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయనపై అభిమానం, ప్రేమ చాటుకున్నారు. దీంతో సస్పెన్సు ఇంకా కొనసాగుతుంది.
Ileana
హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో సహజీవనం చేసిన ఇలియానా గర్భం దాల్చారనే వాదన ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. తాజాగా ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తొమ్మిదో నెల కాడంతో ఏ పనులు చేయలేకపోతున్నాను. నీరసం బాధిస్తుందని, ఆమె కామెంట్ పెట్టారు.
Ileana D cruz
నెలలు నిండాక నడవడం కూడా కష్టమవుతుంది. అందుకే మాతృత్వం గొప్పది అన్నారు. ఇలియానా తనకు తొమ్మిదో నెల అని చెబుతున్న పక్షంలో త్వరలో ఆమెకు డెలివరీ కానుంది. పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. !
Ileana D cruz
కాగా ఇలియానా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ కి దూరమైనా చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఒకప్పుడు ఇలియానా సౌత్ ఇండియా స్టార్ గా వెలిగిపోయింది. అనవసరంగా బాలీవుడ్ కి వచ్చి కెరీర్ నాశనం చేసుకుంది.