హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ట్రెడిషనల్ లుక్ కేక... సరికొత్తగా అందాలు పరిచయం చేసిన భామ!
హెబ్బా పటేల్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీలో నటించింది. ఆహాలో ప్రసారం కానున్న ఆ సిరీస్ లోని లుక్ షేర్ చేసింది.
Hebah patel
2018లో ఢిల్లీ బురారీ ప్రాంతంలో జరిగిన 11 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటన ఆధారంగా హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ తెరకెక్కింది. అక్టోబర్ 6 నుండి ఆహాలో ఇది స్ట్రీమ్ కానుంది.
Hebah patel
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది హెబ్బా పటేల్. పవిత్ర లోకేష్ మరో కీలక రోల్ చేసింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. బురారీ ఘటనపై తెలుగులో వస్తున్న మొదటి చిత్రం ఇది. ఇప్పటికే హిందీలో సిరీస్లు, డాక్యూమెంటరీలు తెరకెక్కాయి.
Hebah patel
హెబ్బా కెరీర్ పరిశీలిస్తే... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.తెలుగులో 'అలా ఎలా?' అనే ఓ చిన్న చిత్రం చేశారు. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది.
Hebah patel
2015లో విడుదలైన కుమారి 21 ఎఫ్ యూత్ కి కిక్ ఇచ్చింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. హెబ్బా నటన, గ్లామర్ ఆకట్టుకున్నాయి. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. కుమారి 21 ఎఫ్ హెబ్బాకు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
Hebah patel
అయితే మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
ఒక దశలో హెబ్బా నటన మానేస్తున్నారా? అనే సందేహాలు కలిగాయి. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడంతో హెబ్బా బరువు పెరిగింది. పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. రెడ్ మూవీలో ఐటెం నంబర్ చేసిన హెబ్బా లుక్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
పరిశ్రమలో ఒకరి ఫేట్ సక్సెస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అదృష్టం కలిసిరాకో, మంచి సినిమాలు ఎంచుకోవడం తెలియకో... హెబ్బా పటేల్ కి ప్లాప్స్ పడ్డాయి. దాంతో ఆమె రేసులో వెనుకబడిపోయింది. అయితే తనకంటూ కొంత అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.