- Home
- Entertainment
- నాకు బట్టలు ఇవ్వకుండా అవమానించారు, ఛీ కొట్టినవాళ్ళే బ్రతిమిలాడుకున్నారు... హన్సిక ఆవేదన!
నాకు బట్టలు ఇవ్వకుండా అవమానించారు, ఛీ కొట్టినవాళ్ళే బ్రతిమిలాడుకున్నారు... హన్సిక ఆవేదన!
హీరోయిన్ హన్సిక మోత్వానీ కెరీర్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు గుర్తు చేసుకున్నారు. సౌత్ హీరోయిన్ అయిన కారణంగా దుస్తులు ఇవ్వమంటూ డిజైనర్స్ అవమానించారని చెప్పుకొచ్చారు.

Hansika Motwani
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న హన్సికకు బాలీవుడ్ లో అవమానాలు ఎదురయ్యాయట. అక్కడి డిజైనర్స్ ఆమెను తక్కువగా చేసేవారట. సౌత్ హీరోయిన్స్ అంటే వారికి చులకన భావన ఉండేదట. మీకు మేము దుస్తులు ఇవ్వమని ముఖాన చెప్పేవారట.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిందట. వారే తమ డిజైన్ చేసిన బట్టలు ధరించాలని బ్రతిమిలాడుతున్నారట. ఒకప్పుడు ఛీ కొట్టినవాళ్లు వచ్చి వేడుకుంటుంటే ఆ ఫీలింగ్ బాగుందని హన్సిక అన్నారు. ఒకప్పుడు నాకు దుస్తులు ఇవ్వను అన్నందుకు వారిపై నేను పగ పెంచుకోలేదు. నా ప్రతిభతో వారు నా దగ్గరకు వచ్చేలా చేయాలని అనుకున్నాను.
ఇప్పుడు వారే వచ్చి ఈ ఈవెంట్ కి మా బట్టలు ధరించండి అంటుంటే... ఇప్పుడు మీరు నన్ను రెడీ చేస్తారా? అని అడిగి ఒక నిమిషం అలోచించి ఓకే అంటాను, అని హన్సిక చెప్పుకొచ్చారు. కాగా కెరీర్ బిగినింగ్ లో ఓ టాలీవుడ్ హీరో డేటింగ్ చేద్దామని విసిగించాడని ఆమె గతంలో చెప్పడం విశేషం. 2022లో హన్సిక బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్నారు.
అంతకు ముందు హన్సిక తమిళ హీరో శింబుతో ఎఫైర్ నడిపారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక హన్సిక తమిళంలో రాణించారు. అక్కడ అధికంగా చిత్రాలు చేశారు. ఈ క్రమంలో హన్సిక శింబు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ఈ జంట ఓపెన్ గానే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటారనే పుకార్లు వినిపించాయి. అనూహ్యంగా శింబు-హన్సిక బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక కెరీర్ మొదలైంది. పలు సీరియస్, సినిమాల్లో నటించారు. హృతిక్-ప్రీతీ జింటా హిట్ మూవీ కోయీ మిల్ గయా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక నటించారు. కాగా ఆమె హీరోయిన్ కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే కావడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాధ్ దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశాడు.
దేశముదురు హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా వంటి చిత్రాల్లో హన్సిక నటించారు. కొన్నాళ్లుగా తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో సెటిల్ అయ్యారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక కోలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం హన్సిక చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నారు.