డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడని ఆ క్లాసిక్ వదులుకోవాలనుకున్న జెనీలియా... అల్లు అర్జున్ చెప్పడంతో!
సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగిపోయిన జెనీలియాను ఓ దర్శకుడు మూడు రోజులు ఇబ్బంది పెట్టాడట. ఆ దెబ్బతో ఆమె రెండు రోజులు షూటింగ్ మానేసిందట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Allu Arjun- Genelia
తెలుగు, తమిళ భాషల్లో స్టార్డమ్ అనుభవించింది జెనీలియా డిసౌజా. తుజే మేరీ కసమ్ అనే హిందీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈ క్యూట్ హీరోయిన్, బాయ్స్ మూవీతో సౌత్ లో అడుగుపెట్టింది. సత్యం, సాంబ, సై వంటి సూపర్ హిట్స్ తో స్టార్ అయ్యింది.
జెనీలియాకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిన చిత్రం మాత్రం బొమ్మరిల్లు. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యూత్ ని ఊపేసింది. దేవిశ్రీ సాంగ్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి. అల్లరి అమ్మాయిగా హాసిని పాత్రలో జెనీలియా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పాగా వేసింది.
సిద్ధార్థ్ కు భారీ విజయం దక్కింది. ఆయనకు స్టార్డం తెచ్చిపెట్టింది. దిల్ రాజు బ్యానర్లో క్లాసిక్ గా బొమ్మరిల్లు నిలిచింది. అయితే ఈ మూవీ నుండి జెనీలియా మధ్యలో తప్పుకోవాలని అనుకుందట. దర్శకుడు భాస్కర్ ఓ సీన్ కోసం మూడు రోజులు నిద్రలేకుండా అర్థరాత్రి షూటింగ్ కి రమ్మనడంతో జెనీలియా షూటింగ్ మానేసిందట.
ఈ మూవీలో సిద్ధార్థ్-జెనీలియా రాత్రివేళ ఐస్ క్రీం తినే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంలో జెనీలియా ఎన్ని టేక్స్ చేసినా భాస్కర్ సంతృప్తి చెందలేదట. రెండో రోజు కూడా షూటింగ్ కి అర్ధరాత్రి పిలిచాడట. ఆ రోజు కూడా షాట్ ఓకే కాలేదట. అలా వరుసగా మూడు రోజులు అర్ధరాత్రి షూటింగ్ కి పిలిచాడట. దాంతో నేను చేయను అని రెండు రోజులు షూటింగ్ కి వెళ్లలేదట జెనీలియా...
ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ జెనీలియాకు నచ్చజెప్పాడట. అల్లు అర్జున్ తో ఉన్న స్నేహం నేపథ్యంలో ఆయన మాటకు ఒప్పుకుని బొమ్మరిల్లు మూవీ చేసిందట. లేదంటే జెనీలియా భారీ హిట్ కోల్పోయేదట. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక అల్లు అర్జున్-జెనీలియా కరుణాకరన్ డైరెక్షన్ లో హ్యాపీ మూవీ చేశారు.