సూటిగా గుండెలను తాకుతున్న ఈషా చురకత్తి లాంటి చూపులు... స్టన్నింగ్ లుక్ వైరల్!
హీరోయిన్ ఈషా రెబ్బా 'ఇంకా' ఏంటని అడుగుతుంది. కళ్ళతో ప్రశ్నిస్తూ చూపులతో చంపేస్తుంది. ఈషా రెబ్బా ఇంటెన్స్ లుక్ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది.

Eesha Rebba
ఈషా రెబ్బాకు కాలం కలిసి రాలేదు. లేదంటే వెండితెరను ఏలేయాల్సింది. అందం, అభినయం ఉండి కూడా రేసులో వెనుకబడిపోయింది. దీనికి వివక్ష కూడా ఒక కారణం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి బాలీవుడ్ భామలను తెచ్చుకుంటారు కానీ లోకల్ టాలెంట్ ని గుర్తించరు.
ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Eesha Rebba
ఈషా అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. ఈషా దయా టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దయా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. దర్శకుడు పవన్ సాధినేని దయా సిరీస్ తెరకెక్కించారు. త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
Eesha Rebba
ఇటీవల ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.
Eesha Rebba
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు అడపాదడపా అవకాశాలు తప్పితే కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సినిమా పడటం లేదు. ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.