షార్ట్ మిడ్డీలో అల్లు అర్జున్ హీరోయిన్ కేథరిన్ బోల్డ్ షో... సోషల్ మీడియా షేక్ అయ్యే గ్లామర్!
హీరోయిన్ కేథరిన్ ట్రెసా సిల్వర్ స్క్రీన్ పై అరుదుగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. షార్ట్ మిడ్డీలో కేథరిన్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Catherine Tresa
మనసులు దోచేసే అందాలు కేథరిన్ ట్రెసా సొంతం. అయితే అమ్మడుకు కాలం కలిసి రాలేదు. దాంతో స్టార్ కాలేకపోయింది. ఫేడ్ అవుట్ దశకు చేరిన కేథరిన్ సోషల్ మీడియాలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందాల విందుకు తెరలేపింది. షార్ట్ ఫ్రాక్ లో హాట్ షో వైరల్ అవుతుంది.
Catherine Tresa
కేథరిన్ డెబ్యూ మూవీ శంకర్ ఐపీఎస్. 2010లో ఈ కన్నడ చిత్రం విడుదలైంది. ఇక తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో అరంగేట్రం చేసింది. అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
Catherine Tresa
దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రాల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనకబడింది. స్టార్ హీరోయిన్ అని అనిపించుకోలేకపోయింది.
Catherine Tresa
మరోసారి అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది. సరైనోడు మంచి విజయం సాధించింది. సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశారు. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంది.
Catherine Tresa
గత ఏడాది బింబిసార మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా 2023 సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా విశ్వాసంతో ముందుకు వెళుతుంది.