MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'బంగారం' లాంటి అబ్బాయిని భర్తగా పట్టేసిన అనుష్క... త్వరలో ఘనంగా పెళ్లి?

'బంగారం' లాంటి అబ్బాయిని భర్తగా పట్టేసిన అనుష్క... త్వరలో ఘనంగా పెళ్లి?

హీరోయిన్ అనుష్క పెళ్లి ఎవర్ గ్రీన్ టాపిక్. హీరోలకు సమానమైన ఫేమ్ కలిగిన అనుష్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారనే? ఆసక్తి ఎప్పటి నుండో ఉంది. అయితే ఆమెకు బంగారం లాంటి అబ్బాయి వరుడిగా దొరికినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 28 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anushka Shetty

Anushka Shetty


సూపర్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు అనుష్క. స్వతహాగా యోగా టీచర్ అయిన  అనుష్క అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సూపర్ మూవీకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అనుష్క అటెండ్ అయ్యారు. దర్శకుడు పూరి అనుష్కను ఆడిషన్ చేశారు. నిజానికి అనుష్క పేరు స్వీటీ.. అనుష్క ని పేరు మార్చింది పూరీనే... 

26

ఇదిలా ఉంటే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ టాలీవుడ్ లో  టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బెంగుళూరు వ్యాపారవేత్త తో అనుష్క పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా అనుష్క పెళ్ళి గురించి రకరకాల వార్తలు చక్కెర్లు కొట్టాయి. కాని అవి రూమ్స్ గానే మిగిలిపోయాయి. 

36

మిర్చి, బాహుబలి సిరీస్ అనుష్క స్టార్ డమ్ మరింత పెంచాయి. అయితే అనుష్క తీసుకున్న రాంగ్ డెసిషన్ ఆమె కెరీర్ ని దెబ్బతీసింది. బాహుబలి 1 విడుదల తర్వాత గ్యాప్ లో సైజ్ జీరో టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఈ సినిమాలో పాత్ర కోసం బాగా బరువు పెరిగింది. అనుష్క పిచ్చ డెడికేషన్ తో చేసిన సైజ్ జీరో మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికి తోడు అనుష్క తిరిగి నార్మల్ ఫిజిక్ సాధించలేకపోయింది.
 

46
Anushka Shetty

Anushka Shetty

బరువు పెరిగిన అనుష్కకు అవకాశాలు తగ్గాయి. యంగ్ హీరోల ప్రక్కన ఆమె సెట్ కాకుండా పోయింది. మామూలుగానే మంచి హైట్ తో పొట్టి హీరోలకు సెట్ కాని అనుష్క బరువు పెరిగాక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం అనుష్క హీరో నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేస్తున్నారు.

56

కాగా 40 ఏళ్ళు దాటినా అనుష్క పెళ్లి మాట ఎత్తడం లేదు. గతంలో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ ని ప్రభాస్, అనుష్క కొట్టిపారేశారు. మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఏజ్ బార్ అవుతుండగా అసలు అనుష్క పెళ్లి చేసుకుంటారా? లేదా ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

66

తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారిని అనుష్క వివాహం చేసుకోబోతున్నారట. అబ్బాయి బంగారం వ్యాపారం చేశాడట. పలు నగల దుకాణాలు ఉన్నాయట. అతనితో అనుష్కకు వివాహం సెట్ అయ్యిందంటున్నారు. త్వరలో పెళ్లి భాజా మోగడం ఖాయం అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved