హాలీవుడ్ పై ఆలియా భట్ హాట్ కామెంట్స్, అదొక్కటే ప్రాబ్లమ్ అంటుంది.
హాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.తాజాగా హాలీవుడ్ లో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించింది బ్యూటీ.

alia bhatt
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో.. ఆలియా భట్ కూడా ఓకరు. ఏ భాష అయినా..? ఏ క్యార్టర్ అయినా.. తనదైన చక్కటి అభినయంతో మెప్పిస్తుంది. వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సోంత ఇమేజ్ తో దూసుకుపోయింది బ్యూటీ. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది బ్యూటీ.
తాను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుుంది. అలియాభట్ తాను చేసే సినిమాల కథల ఎంపికలో కూడా ఆమె కొత్తదనం ఉండేలా చూసుకుంటుంది. ఇక ఆమె రీసెంట్ గా హాలీవుడ్ కు కూడా వెళ్ళింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ.
అయితే హాలీవుడ్ అరంగేట్రానికి సబంధించిన విషయాలు పంచుకున్నారు ఆలియా భట్. ఈ సినిమా ఈ నెల 11న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తన తొలి హాలీవుడ్ సినిమా విశేషాలను పంచుకుంది అలియాభట్. హాలీవుడ్ లో తనకు ఎదురైన ఇబ్బందులు గురించి కూడా మాట్లాడింది బ్యూటీ.
తాజాగా ఆమె మాట్లాడుతూ బాలీవుడ్, హాలీవుడ్..ఎక్కడైనా షూటింగ్ వాతావరణం ఒకేలా ఉంటుంది. అయితే హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్‌లో అమెరికా ఇంగ్లీష్ యాసను పలికించడం మాత్రం పెద్ద సవాలుగా అనిపించింది. నాకు ఇంగ్లీష్‌పై మంచి పట్టుంది. హిందీ సినిమా షూటింగ్స్‌లో కూడా ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా మాట్లాడుకుంటాం.
అయితే హాలీవుడ్ సినిమాలో నటించడం తొలిసారి కాబట్టి ఆ యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించింది. ఓ వారం ప్రాక్టీస్ అనంతరం ఆ యాసపై పట్టు దొరికింది. ఒక్క యాస విషయంలో తప్ప హాలీవుడ్‌లో నాకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు అని చెప్పింది.
ఇక అలియాభట్ నటించిన బాలీవుడ్ మూవీ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడింది ఆలియా భట్. దాదాపు 5 ఏళ్ళు ప్రేమించుకన్నాక వీరు పెళ్ళి చేసుకున్నారు. రీసెంట్ గా వీరికి ఓ పాప కూడా జన్మించింది.
alia bhatt
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. ఈమూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. పాప పుట్టిన తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఆలియా. పాప ఆలనా పాలన చూస్తు.. పాప కాస్త పెద్దది అయిన తరువాత మళ్లీ సినిమాలు చేస్తోంది ఆలియా భట్.