- Home
- Entertainment
- నాతల్లీ తండ్రులే నన్ను వ్యతిరేకించారు.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..
నాతల్లీ తండ్రులే నన్ను వ్యతిరేకించారు.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..
సౌత్ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటోంది ఐశ్వర్య లక్ష్మి. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు సాధిస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా తన పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సౌత్ లోని అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుపుతుంది ఐశ్వర్య లక్ష్మీ.గాడ్స్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరరైన ఈ కేరళ కుట్టి. అమ్ము వెబ్ సిరీస్, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ లాంటి సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. హీరోయిన్ గా మాత్రమే కాదు.. కెరీర్ బిగినింగ్ లోనే.. నిర్మాతగాకూడా మారింది బ్యూటీ. గార్గి వంటి కంటెంట్ ఓరియెంట్ సినిమాలు రూపొందించి మంచి పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన మాతృ పిరిశ్రమ అయిన మలయాళంలో యంగ్ అండ్ హ్యాండ్సమ్ మీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి కింగ్ ఆఫ్ కోత సినిమా చేస్తుంది. ఇక తాజాగా ఐశ్వర్య ఓ ఇంటర్వూలో పాల్గొని సంచలన విషయాలు వెల్లడించింది. తన గురించి.. తన తల్లితండ్రుల గురించి మాట్లాడింది బ్యూటీ.
ముఖ్యంగా తాను నటిని అవుతానంటే తన పేరెంట్స్ వ్యతిరేకించారని వెల్లడించింది ఐశ్వర్య లక్ష్మీ. తాను MBBS చదివానని, డాక్టర్ ను కాబోయి యాక్టర్ ను అయ్యానని చెప్పింది. సినిమాల గురించి తన తల్లిదండ్రులలో నెగిటివ్ అభిప్రాయం ఉందని వివరించింది ఐశ్వర్య. బయట చూసేవి, వినేవాటిని బట్టి వారిలో సినిమాలంటే చెడు అభిప్రాయం పడిందన్నారు ఐశ్వర్య లక్ష్మి.
దాంతో యాక్టింగ్ ను గౌరవప్రదమైన కెరీర్ గా వాళ్లు భావించలేరని వెల్లడించింది. ఇప్పటికీ తన సినీ కెరీర్ వారికి ఇష్టం లేదని చెప్పింది. తన దృష్టిలో సినిమా పరిశ్రమలో కొనసాగడం అంత సులభమైన కాదని, ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తుందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
<p>லாங் ஸ்கர்ட் போட்டு வேற லெவல் அழகு </p>
ఇక లేడి ఒరియెంటెడ్ మూవీస్ పై తనకు పెద్దగా ఇంట్రస్టె లేదంటోంది బ్యూటీ. తనకు ఆ సినిమాలపై నమ్మకం లేదని చెప్పింది. ఆడవాళ్ళు మాత్రమే ప్రధాన పాత్రలు చేసే కథలను నేను నమ్మను. ఎందుకంటే జీవితంలో స్త్రీలు, పురుషులు అందరూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని తెలిపింది. ‘తన దృష్టిలో సినిమా అంటూ బ్యాలెన్స్‌గా ఉండాలని అంటోంది ఐశ్వర్య.
Aishwarya Lakshmi
అంతే కాదు సినిమా అంటే సమాజానికి, మన జీవితాలకు ప్రతిబింబం కావాలి.. మన జీవితాల్లో కూడా వెండితెరపై సమతూకం ఉండాలి అంటూ.. వివరిస్తోంది బ్యూటీ ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలె వైరల్ అవుతున్నాయి.