- Home
- Entertainment
- స్టార్ హీరోలను తలదన్నేలా సమంత లగ్జరీ కార్లు, సామ్ వాడుతున్న 5 లగ్జరీ కార్లేంటి, వాటి కాస్ట్ ఎంత...?
స్టార్ హీరోలను తలదన్నేలా సమంత లగ్జరీ కార్లు, సామ్ వాడుతున్న 5 లగ్జరీ కార్లేంటి, వాటి కాస్ట్ ఎంత...?
సినిమా స్టార్లు, సెలబ్రెటీ హీరోలు,హీరోయిన్లు వాడే వస్తువుల గురించి తెలుసుకోవాలి అని నెటిజన్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్లు ఏ కార్లు వాడుతున్నారు. ఏ వాచ్ లు కొంటున్నారు అని చూస్తుంటారు. ప్రస్తుతం సమంత వాడుతున్న లగ్జరీ కార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. పెళ్ళి , విడాకుల మద్య కూడా సమంత హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది... ఇప్పటికీ చేస్తుంద కూడా. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది సమంత
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్తూ... ఉంటారు. ఇక ఇంత స్టార్ డమ్ తో దూసుకుపోతున్న సమంత.. ఏకార్లు వాడుతున్నాడు. ఎంత లగ్జరీ కార్లు వాడుతుండుంటారు అని తెలుసుకోవాలి అని అభిమానులకు తప్పక ఉంటుంది.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సినిమా వరుస షూటింగ్ లతో మరింత బిజీగా ఉండేలా చూసుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన తరువాత ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. సమంత ట్రేండింగ్ లో ఉంటూ కెరీర్ లో స్పీడ్ పెంచింది సామ్.
టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు.. అటు హాలీవుడ్ లో కూడా నటిస్తుంది సమంత. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక స్టార్ స్టేటస్ తో వెలిగిపోతున్న సమంత వాడుతున్న లగ్జరీ కార్ల రేటు ఎంతో తెలుసా..?
రెండు ద్విభాషా సినిమాల్లో నటిస్తున్న సమంత.. సంపాదన విషయంలోనూ, సేవ చేసే విషయంలోనూ ముందుంటుంది. ఇక సమంతు వాడుతున్న కర్లతో చెప్పుకోదగ్గది 2.26 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు.
సమంత దగ్గర దాదాపు 5 లగ్జరీ కార్లు ఉన్నాయి వాటి ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుంది. అందులో స్వాంకీ పొర్చే కేమన్ కారు కూడా ఒకటి దీని ఖరీదు అక్షరాలా... 1 .46 కోట్ల రూపాయలు.
లగ్జీరి లైఫ్ విషయంలో తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది సమంత. ఇక ఆమె గ్యారేజ్ లో ఉన్న కార్లలలో బెంజ్ కూడా ఉంది. ఆమె దగ్గర ఉన్న మెర్సిడేజ్ బెంజ్ కారు విలువ దాదాపు 1.4 కోట్లు.
అంతే కాదు ఇండివిడ్యూవల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సామ్ దగ్గర 83 లక్షల విలువ చేసే ఆడి క్యూ 7 కారు కూడా ఉంది. కాస్ట్లీ కార్లలో తనకు నచ్చిన దానితో సొంత డ్రైవింగ్ లో లాంగ్ డ్రైవ్ కు కూడా వెళ్తుందట బ్యూటీ.
ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత లిస్ట్ లో మరో కాస్ట్లీ కారు కూడా ఉంది. అందరికి ఎంతో ఇష్టమైన జాగ్వార్ ఎఫ్ ఎక్స్ ను కూడా సామ్ సొంతం చేసుకున్నారు. దీని విలువ 72 లక్షలపైనే ఉంటుంది.