హీరోయిన్ మెహ్రీన్ ఆవేదన... సోషల్ మీడియా చిట్ చాల్ లో ఎమోషనల్ అయిపోయిన బ్యూటీ
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా ఆవేదన చెందారు.మనసునిండా బాధతో మనోవేదనకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసుకుంటూ తన బాధను బయటపెట్టింది.

సినీ పరిశ్రమలో ఆర్టిస్టుల గురించి వేదన వ్యక్తం చేసింది హీరోయిన్ మెహ్రీన్. ఆర్టిస్ట్ ల జీవితాల గురించి చాలా బాధపడింది. చిన్న పెద్ద ఆర్టిస్టుల తరపున వకాల్తా పుచ్చుకున్న హీరోయిన్.. సోషల్ మీడియా చిట్ చాట్ తో తన వేదన వెల్లబుచ్చింది.
కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆతరువాత వచ్చిన వరుస సినిమాలు హిట్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. మధ్యలో నోటా, పంతం, జవాన్ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు బ్యూటీకి. మళ్ళీ ఎఫ్2 సినిమాతో ఫామ్ లోకి వచ్చింది మెహ్రీన్.
పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి.. ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్ళిన మెహ్రీన్.. మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీ అవుతోంది. వరుస సినమాలతో సందడి చేస్తున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంటుంది.
సినీ పరిశ్రమ, ఆర్టిస్టుల జీవితాలపై హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఆవేదనా భరిత వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టుల జీవితాలే చాలా చిత్రంగా ఉంటాయని అంటోంది. జీవితంలో ఎలాంటి గ్యారంటీలేని బతుకులు ఆర్టిస్ట్ లవని తెలిపింది. అలాంటి అస్థిర జీవితాలను తాము ఎంతో ఇష్టపూర్వకంగానే ఎంచుకుంటామని చెప్పింది.
అంతే కాదు ఒక ఆర్టిస్ట్ తను చేస్తున్న సినిమా కోసం తమ శరీరాలను అనుకూలంగా మలచుకుంటామని తెలిపింది. ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటామని, కొన్నికొన్ని సార్లు పాతాళానికీ కూడా వెళ్లిపోతుంటామంటోంది. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ.. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ప్రత్నిస్తామంటోంది మెహ్రీన్.
ఒక్కోసారి రాత్రికి రాత్రే సూపర్ సక్సెస్ లు వచ్చిపడుతుంటాయి.. మరోసారి అతి ధారణమైన ఫెయిల్యూర్స్ కనిపిస్తుంటాయి.. అన్నింటిని ఫేస్ చేస్తూ సాగిపోయేది ఆర్టిస్ట్ మాత్రమే అంటోంది మెహ్రీన్. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సినీ జీవితంలో భాగంగా తాము అన్నిటికీ అలవాటు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతే కాదు ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని ఎండనకా.. వాననక.. పగలు, రాత్రుళ్లన్న తేడా లేకుండా రోజులు, వారాలపాటు కష్టపడుతుంటామని తెలిపింది స్టార్ హీరోయిన్. ఇంటికి, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటూ.. మరింత ముందుకు పోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటామంటోంది హీరోయిన్. ఏది చేసినా.. ఎంత కష్టపడినా.. అంతిమంగా కళ కోసమేనని అంటోంది మెహ్రీన్ ఫిర్జాదా.
ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్3 మూవీతో పాటు మంచిరోజులు వచ్చాయి మూవీలో నటిస్తోంది. అంతే కాదు. కన్నడాలో ఓ సినిమా చేస్తున్న మెహ్రీన్ బాలీవుడ్ లో కూడా ఆఫర్లు కొట్టేస్తోంది.