MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవి మా అక్క అనుకుంటారు కానీ... ఆమె ఇప్పటికీ విదేశాల్లో షూటింగ్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది!

శ్రీదేవి మా అక్క అనుకుంటారు కానీ... ఆమె ఇప్పటికీ విదేశాల్లో షూటింగ్స్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది!

హీరోయిన్ మహేశ్వరి (Maheswari)చేసింది తక్కువ చిత్రాలే అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మిడ్ నైన్టీస్ లో మహేశ్వరి యూత్ కలల రాణిగా ఉన్నారు. తేనె కళ్ళు, హస్కి వాయిస్ తో మహేశ్వరి చాలా విభిన్నంగా అనిపించేవారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 19 2022, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ(Gulabi) మూవీ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. 'మేఘాలలో..','ఈవేళలో నీవు'.. వంటి సాంగ్స్ యువతకు ఊపేశాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


తర్వాత మహేశ్వరి హీరోయిన్ గా నటించిన పెళ్లి, ప్రియరాగాలు, తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రాలు విజయం సాధించాయి. 2000 సంవత్సరం తర్వాత ఆమె సడన్ గా మహేశ్వరి సినిమాలు చేయడం మానేశారు. అప్పటికి ఆమె కెరీర్ కూడా డౌన్ ఫాల్ అయ్యింది. 

37


పదేళ్ల తర్వాత 2010లో బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించారు. మంచి ఆరంభం లభించినా మహేశ్వరి కెరీర్ నిర్మించుకోవడంలో విఫలం చెందారు. ఆమె చాలా త్వరగా ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నారు. కేవలం టూటైర్ హీరోలతోనే ఆమెకు అవకాశాలు దక్కాయి. 
 

47


చాలా కాలం తర్వాత ఆలీతో సరదాగా (Alitho Saradaga)టాక్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ షోకి అతిథిగా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దివంగత శ్రీదేవి తనకు అక్క అవుతుందని అందరూ భావిస్తారు.. నిజానికి ఆమె నాకు చిన్నమ్మ అవుతారు. నేను మాత్రం అక్కా అని పిలిచేదాన్ని. పప్ప అక్క అని పిలవడం అలవాటైపోయింది. ఆమె ఇంకా అబ్రాడ్ లో షూటింగో, ఈవెంటో చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. ఆవిడ లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. 

57


ఇక సెట్స్ లో నేను చాలా కామ్. ఎవరితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దీంతో శ్రీదేవి (Sridevi)ఫ్యామిలీ నుండి వచ్చింది కదా పొగరు ఈమెకు అనుకునేవారు. నిజానికి నా తత్వమే అంత అనేది ఎవరికీ తెలియదు. 
 

67


గులాబీ మూవీలో మేఘాలలో... సాంగ్ షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాం. నాకు సాధారణంగానే బైక్ పై వేగంగా వెళ్లడం అంటే భయం. పాట షూటింగ్ సమయంలో పొరపాటున బైక్ స్కిడ్ అయ్యింది. పక్కనే ఉన్న లోయలోకి జారిపోయాం. కొంచెం ఉంటే చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకునేది... అంటూ మహేశ్వరి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

77


తెలుగులో మహేశ్వరికి మొదటి చిత్రం అమ్మాయి కాపురం. ఈ మూవీలో హీరోగా ఆలీ నటించడం విశేషం. అలాగే ఇద్దరూ దర్శకుడు భారతీరాజా ద్వారానే పరిచయం అయ్యారు. మహేశ్వరి డెబ్యూ మూవీ కరుతమ్మ చిత్రాన్ని భారతీరాజా డైరెక్ట్ చేశాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆలీ పరిచయమైన సీతాకోకచిలుక మూవీకి కూడా భారతీరాజానే దర్శకుడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved