Lavanya Tripathi: చౌకబారు నటివంటూ నెటిజన్ కామెంట్.. మండిపడిన లావణ్య త్రిపాఠి.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు... ఎక్కడో ఏదో జరిగితే.. అది హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ట్రోల్ చేసే వరకూ వచ్చింది. ఏ సంబంధం లేకపోయినా పాపం లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మాటలు పడాల్సి వచ్చింది.

మత మార్పిడి విషయంలో బలవంతం చేశారంటూ లావణ్య అనే అమ్మాయి తమిళ నాడులో ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.దాంతో సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. లవణ్య హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ లు వైరల్ అవుతునాయి. అయితే కొందరు లావణ్య బదులు హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పేరుతో హ్యాట్యాగ్ వాడుతున్నారు.
హ్యాష్ ట్యాగ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వైపు వచ్చే సరికి. ఆమె గురించి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది లావణ్య అనే హ్యాష్ ట్యాగ్ కు బదులు, లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) అనే హ్యాష్ ట్యాగ్ వాడటంతో. ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అసభ్యంగా ఓకామెంట్ పెట్టాడు. ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ అవుతుంది. దాంతో ఈ కామెంట్ కు ఘాటుగా స్పందించింది హీరోయిన్.
అసలు ఆ నెటిజన్ ఏం కామెంట్ పెట్టాడంటే.. నెటిజన్లను ఉద్దేశించి చెపుతూ..లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హ్యాష్ ట్యాగ్ వాడకండి. ఆమె ఒక సినీ నటి. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సామాన్య దళిత బాలిక. ధర్మం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమెను చౌకబారు నటితో పోల్చకండి అని ట్వీట్ చేశాడు. దీనిపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మహా ఘాటుగా స్పందించింది.
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) స్పందిస్తూ...ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాతే మీలాంటి వాళ్లు మహిళలను గౌరవించడాన్ని ఎందుకు ప్రారంభిస్తారు? అంతకు ముందు ఆమెను చీప్ అని అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. కానీ సమాజం యొక్క నిజ స్వరూపం ఇదే అని కౌంటరిచ్చింది.
గతంలో కూడా ఇలాంటి చాలా కామెంట్లను ఫేస్ చేసింది లావణ్య(Lavanya Tripathi). అంతే కాదు చాల మందికి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే కాదు. స్టార్ హీరోయిన్లు చాల మందికి ఇలాంటి కామెంట్లు నేటిజన్ల నుండి తప్పడం లేదు. ఇంతకంటే ధారుణమైన కామెంట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి
ప్రస్తుతం లావణ్య(Lavanya Tripathi) మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తోంది. రీసెంట్ గా ఆమె చేసిన చావు కబురు చల్లగా. ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇక మంచి హిట్ సినిమా కోసం చూస్తుంది లావణ్య. మహేష్ బాబు( Mahesh Babu) పక్కన సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది అన్న న్యూస్ టాలీవుడ్ లో నడుస్తుంది.
ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే మూవీ చేస్తుంది లావణ్య(Lavanya Tripathi). ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తో లవ్ లో ఉంది అంటూ న్యూస్ గట్టిగా వైరల్ అయ్యింది. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోస్ తో పాటు..తన డైలీ లైఫ్ లో కొన్ని విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటుంది లావణ్య.