- Home
- Entertainment
- సోషల్ మీడియాలో టాప్ సీక్రెట్ షేర్ చేసుకున్న హెబ్బా పటేల్, తొందరలో చెప్పేసిందా.. లేక కావాలనే చెప్పిందా..?
సోషల్ మీడియాలో టాప్ సీక్రెట్ షేర్ చేసుకున్న హెబ్బా పటేల్, తొందరలో చెప్పేసిందా.. లేక కావాలనే చెప్పిందా..?
కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచిన హీరోయిన్ హెబ్బా పటేల్. అయితే ఈసినిమా తరువాత అంతటి సక్సెస్ ను మళ్లీ చూడలేదు హెబ్బా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే.. ఈ బ్యూటీ.. ఓ టాప్ సీక్రేట్ ను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్.. సక్సెస్ లు లేకపోయినా ఆడియన్స్ కు గుర్తుండిపోయే హీరోయిన్ అయ్యింది. కుమారీ 21ఎఫ్ తరువాత హిట్ లేకపోయినా.. ఇండస్టరీలో ఏదో ఒక్క ప్రయత్నం చేస్తూ వస్తోంది హెబ్బా. చిన్నచితకా పాత్రలు, మరీ చిన్నసినిమాలతో నెట్టుకొస్తోంది.
రాజ్ తరుణ్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది యంగ్ హీరోయిన్. ఈ ఇద్దరు యంగ్ స్టార్స్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బాగా వర్కౌట్ అయ్యింది. ఒక దశలో వీరిద్దరు సీరలకల్లోతు ప్రేమలో ఉన్నారని..త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. కాని ఆతరువాత వీరి కాంబోలో సినిమాలు రాలేదు.
వరుస సినిమాలు చేస్తున్న హెబ్బాపటేల్ కు సక్సెస్ మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. కాని హీరోయిన్ గా ఇమేజ్ మత్రం అలాగే ఉంది. హాట్ హాట్ ఫోజులు ఇవ్వడంతో కూడా హెబ్బా ఆరితేరింది. సోషల్ మీడియాలో ఆమె అందాలకు ఫిదా అయ్యి.. ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులను నిత్యం పలకరిస్తుంటుంది హెబ్బా పటేల్. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా కనిపిస్తున్న హెబ్బా తాజాగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ నిర్వహించింది.
అందలో ఫ్యాన్స్ అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన బ్యూటీ.. ఓ నెటిజన్ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని ఓ అభిమాని అడగ్గా... అదో పెద్ద సీక్రెట్ అంటూ జవాబిచ్చింది. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదంటోంది హెబ్బా పటేల్. తొలిసారి తన సీక్రేట్ రివిల్ చేసింది.
తన అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని అంటోంది హెబ్బా. ఆ ఆన్సర్ ద్వారా తాను బ్యూటీ సర్జరీలు చేయించుకున్న విషయాన్ని హెబ్బా పరోక్షంగా బయట్టేసింది.
ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్, తెలిసినవాళ్లు అనే సినిమాల్లో నటిస్తోంది. తనకు మంచి బ్రేక్ వస్తే మళ్లీ మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలని ఆశపడుతుంది హెబ్బా. దానికోసం ఎంతో ట్రై చేస్తోంది. మరి ఈసారైనా ఈ ముంబయి భామ ఆశ తీరుతుందా లేదా చూద్దాం.