విజయ్ ఆంటోని నా కాలేజ్ మేట్.. మీరా మృతిపై వేదికపైనే ఏడ్చేసిన విశాల్
హీరో విశాల్ ప్రస్తుతం తాను నటించిన మార్క్ ఆంటోని చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా హిట్ గా నిలిచింది.
Actor Vishal
హీరో విశాల్ ప్రస్తుతం తాను నటించిన మార్క్ ఆంటోని చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా హిట్ గా నిలిచింది. దీనితో రిలీజ్ తర్వాత కూడా విశాల్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ మార్క్ ఆంటోని చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకువెళుతున్నాడు.
అయితే తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన విషాదకర సంఘటన దేశం మొత్తం సంచలనంగా మారింది. ఇటీవల ప్రముఖ హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది. స్కూల్ లో చదువుల ఒత్తిడి, డిప్రెషన్ కారణం అంటూ చెబుతున్నప్పటికీ ఆమె మృతి గురించి సరైన కారణాలు బయటకి రావడం లేదు.
vishal
ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయ్ ఆంటోని కుమార్తె మీరా మృతిపై స్పందిస్తున్నారు. చెన్నైలో నిర్వహించిన మార్క్ ఆంటోని మూవీ సక్సెస్ మీట్ లో విశాల్ మీరా మృతిపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మృతి పట్ల నిమిషం పాటు మౌనం పాటించారు.
విజయ్ ఆంటోని తన కాలేజ్ మేట్ అని గుర్తు చేసుకున్న విశాల్.. మీరా మృతి పట్ల వేదికపైనే ఏడ్చేశారు. మీరా ఆత్మకి శాంతి చేకూరాలని విశాల్ అన్నారు. విజయ్ కి జరిగిన ఈ నష్టం నాకు జరిగినట్లు అనిపిస్తోంది అని విశాల్ అన్నారు. వెంటనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకుని వేదికపై తన ప్రసంగాన్ని కొనసాగించారు.
గజని మహమ్మద్ 18 ఏళ్ళు దండయాత్ర చేసినట్లు తాను విజయం కోసం 11 ఏళ్ళు పోరాటం చేశానని విశాల్ అన్నారు.ఎట్టకేలకు నాకు దక్కిన విజయం మార్క్ ఆంటోని మూవీ. ఈ చిత్ర విజయంలోచాలా మంది సహకరించారు. వారందరికి నా కృతజ్ఞతలు అని విశాల్ అన్నారు.
ఈ చిత్రం ద్వారా నాకు మంచి మిత్రులు లభించారు. నిర్మాత వినోద్ కుమార్ కేవలం ఒక్క పాట కోసమే కోటిన్నర ఖర్చు చేశారు. ఆయనకి హ్యాట్సాఫ్. ఇక దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మూవీ కోసం చివరి నిమిషం వరకు కష్టపడుతూనే ఉన్నారని వారివల్ల సక్సెస్ సాధ్యం అయింది అని విశాల్ తెలిపారు.