ఇలాగే నయనతారని అడిగే ధైర్యం ఉందా.. హీరోయిన్ పై హీరో తీవ్ర వ్యాఖ్యలు, ఆమె బిహేవియర్ గురించి ఇలా..
భువనేశ్వర్ కి చెందిన బోల్డ్ బ్యూటీ స్వయం సిద్దా దాస్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమెకి ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలో ఛాన్సులు వస్తున్నాయి.
భువనేశ్వర్ కి చెందిన బోల్డ్ బ్యూటీ స్వయం సిద్దా దాస్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆమెకి ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలో ఛాన్సులు వస్తున్నాయి. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక కీలక పాత్రల్లో సైతం స్వయం సిద్దా దాస్ నటిస్తోంది. శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో స్వయం సిద్దా నటిస్తోంది.
అయితే ఆమె హీరోయిన్ గా నటించిన 'ఎనక్కు ఎండే కిడైయాదు' చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్ రమేష్ హీరోగా నటించారు. దర్శకుడు కూడా అతడే. విక్రమ్ రమేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక్ వెంకట్రామన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల ఈ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్ వేడుక చెన్నై లో జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు, హీరో అయిన విక్రమ్ రమేష్ హీరోయిన్ పై పబ్లిక్ గానే సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ స్వయం సిద్దా బిహేవియర్ ఏమాత్రం బాగాలేదు అంటూ వేదికపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరు కాలేదు.
దీనితో విక్రమ్ రమేష్ మాట్లాడుతూ.. కథా చర్చల సమయంలోనే హీరోయిన్ కి అన్ని కండిషన్స్ చెప్పాము. ప్రమోషన్స్ లో పాల్గొనాలని చెప్పాం. కానీ ఇప్పుడు ఆమె ప్రమోషన్స్ కి రావడం లేదు. అన్నింటికీ ఒకే చెప్పిన ఆమె ఇప్పుడు మాత్రం ఏమీ పట్టనట్లు ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు అని విక్రమ్ రమేష్ హెచ్చరించారు.
చిత్రాన్ని ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాల్సిన భాద్యత నటీనటులందరిపై ఉంటుంది. ప్రమోషన్స్ కి రమ్మని అడిగితే ఇండియన్ 2, కెప్టెన్ మిల్లర్ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నట్లు చెబుతోంది అని విక్రమ్ రమేష్ మండిపడ్డారు. అయితే స్వయం సిద్దా దాస్ అభిమానులు విక్రమ్ రమేష్ కి సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. ఒక హీరోయిన్ గురించి వేదికపై హీరోనే అలా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ప్రమోషన్స్ కి హాజరు కాని నయనతార లాంటి సీనియర్ హీరోయిన్స్ ని ప్రశ్నించే ధైర్యం విక్రమ్ రమేష్ కి ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె తన చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు.
కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే నయన్ లాంటి వాళ్లే ప్రమోషన్స్ కి హాజరు కావడం లేదు. క్రేజ్ ఉన్న హీరోయిన్ పై ఒకలా.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్స్ పై ఒకలా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా స్వయం సిద్దా దాస్ సోషల్ మీడియాలో క్రమంగా పాపులర్ అవుతోంది. బోల్డ్ ఫొటోస్ తో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది.