MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీఎం కేసీఆర్‌ని కలిసిన `ధళపతి` విజయ్‌.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌.. ఫోటోలు వైరల్‌

సీఎం కేసీఆర్‌ని కలిసిన `ధళపతి` విజయ్‌.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌.. ఫోటోలు వైరల్‌

కోలీవుడ్‌ హీరో, `ధళపతి` విజయ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ని కలవడం విశేషం. సీఎంకి పుష్ప గుచ్ఛం ఇచ్చారు. అనంతరం కేసీఆర్‌ .. విజయ్‌ని శాలువాతో సత్కరించారు. అయితే కోలీవుడ్‌ హీరో, సీఎం కేసీఆర్‌ని కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 18 2022, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Vijay met CM KCR

Vijay met CM KCR

కోలీవుడ్‌ హీరో, ధళపతి విజయ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ని కలవడం విశేషం. సీఎంకి పుష్ప గుచ్ఛం ఇచ్చారు. అనంతరం కేసీఆర్‌ .. విజయ్‌ని శాలువాతో సత్కరించారు. అయితే కోలీవుడ్‌ హీరో, సీఎం కేసీఆర్‌ని కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

`ధళపతి` విజయ్‌ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్‌ వంశీపైడిపల్లి దర్శకత్వంలో `విజయ్‌ 66` పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం విజయ్‌, వంశీపైడిపల్లి చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగు, తమిళంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. 

37

ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుకుంటోన్న నేపథ్యంలో మర్యాద పూర్వకంగా విజయ్‌.. సీఎం కేసీఆర్‌ని కలిసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ షూటింగ్‌లకు చాలా అనుకూలంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌ల విషయంలో చాలా సహకారం అందిస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం. 

47

అదే సమయంలో సినిమాల గురించి కేసీఆర్‌ కూడా విజయ్‌ని అడిగి తెలుసుకున్నట్టు, దీంతోపాటు సౌత్‌ సినిమా అభివృద్ధి, తమిళనాడు రాజకీయాలు వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

57

అయితే వంశీపైడిపల్లి, ఎంపీ సంతోష్‌ కుమార్‌కి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆ పరిచయంతోనే సీఎం కేసీఆర్‌ని, విజయ్‌ని కలిసేలా చేశారని సమాచారం. ఈ ఇద్దరి మీటింగ్‌లో సంతోష్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించినట్టు టాక్‌. 
 

67

దర్శకుడు వంశీపైడిపల్లి, అలాగే నిర్మాత దిల్‌రాజు తెలంగాణే కావడంతో ఈ విజయ్‌ని, సీఎం కేసీఆర్‌తో కలవడం ఈజీ అయ్యిందని టాక్‌. అయితే తమిళనాడులో విజయ్‌ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఆ సాంకేతాలేవీ కనిపించడం లేదు. కానీ విజయ్‌, కేసీఆర్‌ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. 

77

ఇక వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాపై తెలుగు నాట భారీ అంచనాలు నెలకొన్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image2
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Recommended image3
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved