విజయ్ దేవరకొండను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు... పేరు బయటపెట్టి తండ్రి ఆరోపణలు!
హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు ఓ నిర్మాతపై షాకింగ్ ఆరోపణలు చేశారు. తన కొడుకును బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.
Vijay Devarakonda
ఖుషి చిత్ర సక్సెస్ మీట్లో హీరో విజయ్ దేవరకొండ(Devarakonda) కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్స్ నుండి 100 మందిని ఎంపిక చేసి రూ. 1 లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు...
Kushi movie
ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ట్వీట్ ని కోట్ చేస్తూ అభిషేక్ పిక్చర్స్ సెటైర్ వేసింది. మీది మంచి హృదయం. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో రూ.8 కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ఆదుకోండి. ఆ డబ్బులు కూడా చెల్లించండి అని ట్వీట్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ తీరుపై ఫ్యాన్స్ మండిపడ్డారు.
Vijay Devarakonda
నిర్మాతలను అడగాల్సిన డబ్బులను హీరోని ఎందుకు అడుగుతున్నారు? ఆర్థికలావాదేవీలతో హీరోకి ఏం సంబంధం అని మద్దతుగా నిలిచారు. ఈ విషయంపై విజయ్ దేవరకొండ తండ్రి తాజాగా స్పందించారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
Vijay Devarakonda
''వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్ కావడంతో విజయ్ దేవరకొండ హాఫ్ రెమ్యూనరేషన్ నిర్మాతలకు తిరిగిచ్చేశాడు. వాళ్ళు ఆఫర్ చేసిన ఫ్లాట్ కూడా తీసుకోలేదు. ఇంతకంటే ఎవరు చేస్తారు?. అయినా ఇవన్నీ మీరు నిర్మాతను అడగాలి. అభిషేక్ నామా కొన్నాళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయం విజయ్ దేవరకొండకు కూడా తెలియదు.
ఏదైనా ఆర్థిక పరమైన వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం సరికాదు. అభిషేక్ నామా విజయ్ దేవరకొండను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు. అయితే అతని పప్పులు ఉడకవు. ఒకసారి విజయ్ మార్కెట్ పడిపోయిందని అంటాడు. మళ్ళీ అతనే విజయ్ డేట్స్ కావాలని అంటాడు.
విజయ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, దిల్ రాజు బ్యానర్స్ లో చిత్రాలకు సైన్ చేశాడు. విజయ్ డేట్స్ ఖాళీగా లేవు'' అని గోవర్ధనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిషేక్ నామాపై గోవర్థనరావు చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
`ఖుషి` చిత్రం పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే నైజాం, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆంద్ర, సీడెడ్‌లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. తమిళనాడులో ఈ చిత్రం పది కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. అయితే భారీ వర్షాలు, `జవాన్`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రాల ప్రభావం ఈ చిత్రంపై పడింది. ఇప్పటి వరకు ఈ చిత్రం సుమారు రూ.90కోట్ల గ్రాస్ సాధించిందని తెలుస్తుంది.