MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి... మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు ?

గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి... మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు ?

లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 15 2024, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో వీరి వివాహం జరిగింది. అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Lavanya tripathi konidela

Lavanya tripathi konidela

అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన అందం, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో లావణ్యకు వరుస ఆఫర్లు వచ్చాయి. యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుణ్ తేజ్ కి జంటగా రెండు సినిమాల్లో నటించింది. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వరుణ్ తేజ్ - లావణ్య జత కట్టారు. ఆ సినిమాలు షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ళు సీక్రెట్ గా డేటింగ్ చేశారు. 

36
Lavanya tripathi konidela

Lavanya tripathi konidela

అప్పట్లో వరుణ్ తేజ్ - లావణ్య  రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదని వరుణ్ తేజ్ కొట్టిపారేయడం విశేషం. కానీ కొన్ని రోజులు తర్వాత సడన్ గా  ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. గత ఏడాది నవంబర్ లో ఇటలీలో లావణ్య - వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.  ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  

46
Lavanya tripathi konidela

Lavanya tripathi konidela

ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాల్లో బిజీగా మారిపోయాడు. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల పరంగా స్పీడ్ తగ్గించేసింది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వె సిరీస్ లో నటించింది. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ ఆమె ప్రకటించలేదు.   పైగా ఇటీవల ఆమె కాలుకి దెబ్బ తగలడంతో రెస్ట్ తీసుకుంటూ  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే .. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. 

 

 

56

మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు. నాగబాబు కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. లావణ్య లేటెస్ట్ ఫొటోలే ఈ ప్రచారానికి కారణం అయ్యాయి. వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లావణ్య సంప్రదాయంగా పట్టు బట్టలో మెరిసిపోతూ కనిపించింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

66

ఈ ఫోటోల్లో లావణ్య కాస్త బొద్దుగా కనిపించింది. పైగా పొట్ట కనిపించకండా ఆమె చీర చెంగుతో కవర్ చేశారు. ఆమె చీర చుట్టుకున్న తీరు చూసి నెటిజన్లు లావణ్య ప్రెగ్నెంట్ అని భావిస్తున్నారు. పైగా ఇటీవల కాలంలో లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండకపోవడం తో లావణ్య త్రిపాఠి గర్భవతి అని ఫిక్స్ అవుతున్నారు.  త్వరలో మెగా ఫ్యామిలీలో వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dorathy Box Office: రూ.1 కోటి కూడా రాలేదా? కీర్తి సురేష్ మూవీకి ఘోర అవమానం.. ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుసా
Recommended image2
Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
Chiranjeevi: 'బాస్ తొక్కేశాడు' చిరంజీవి వరకు వెళ్లిందా..చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాని కుదిపేసిన బాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved