- Home
- Entertainment
- Siva Karthikeyan:ఒకప్పటి సామాన్య కమెడియన్ నేడు వంద కోట్ల హీరో... శివ కార్తికేయన్ ఆస్తి విలువ ఎంతంటే?
Siva Karthikeyan:ఒకప్పటి సామాన్య కమెడియన్ నేడు వంద కోట్ల హీరో... శివ కార్తికేయన్ ఆస్తి విలువ ఎంతంటే?
కృషితో నాస్తి దుర్భిక్షం... పట్టుదలతో ప్రయత్నం చేస్తే అసాధ్యం ఏమీ లేదు. దానికి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ జీవితమే ఉదాహరణ. ఓ సాధారణ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు శివ కార్తికేయన్(Siva Karthikeyan).

నేడు శివ కార్తికేయన్ పుట్టినరోజు (Siva Karthikeyan Birthday) కాగా... ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. శివ కార్తికేయన్ 1985 ఫిబ్రవరి 17వ తేదీన తమిళనాడులోని సింగంపునారి అనే గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే శివ కార్తికేయన్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ చిన్న అవకాశం వచ్చినా వదులుకునేవాడు కాదు. స్కూల్, కాలేజ్ కల్చరల్స్ లో ప్రదర్శనలు ఇచ్చేవాడు.
ఒక పక్క చదువు సాగిస్తూనే మరో ప్రక్క టెలివిజన్ షోలలో పాల్గొంటూ ఉండేవాడు. శివ కార్తికేయన్ తండ్రి పేరు జి దాస్. ఆయన జైలు సూపరిండెంట్ కాగా తల్లి పేరు రాజి దాస్. హీరో కాకముందే శివ కార్తికేయన్ కి వివాహం జరిగింది. శివ కార్తికేయన్ ఆగస్టు 27న 2010 లో ఆర్తి దాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ 2013లో ఒక పాప జన్మించింది. ఈ పాప పేరు ఆరాధన.
స్నేహితుల ప్రోద్బలంతో ఓ తమిళ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ షోలో విన్నర్ గా నిలిచిన శివ కార్తికేయన్ మొదటి బ్రేక్ అందుకున్నారు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత చాలా టెలివిజన్ షోలలో పాల్గొన్నాడు.
టెలివిజన్ షోలు చేస్తూనే నటుడిగా మెరుగయ్యేలా ప్రణాళికలు వేసుకున్నాడు. దాని కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. కోలీవుడ్ లో శివకార్తికేయన్ ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత, మెరీనా అనే చిత్రంలో హీరోగా ఛాన్స్ దక్కింది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మెరీనా 2012లో విడుదలైంది. ఆ సినిమా తర్వాత ధనుష్-శృతి హాసన్ జంటగా తెరకెక్కిన '3' సినిమాలో ధనుష్ ఫ్రెండ్ రోల్ చేశారు.
2013లో విడుదలైన కేడీ బిల్లా కిలాడీ రంగ చిత్రంతో హీరోగా శివ కార్తికేయన్ కి బ్రేక్ దక్కింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ శివ కార్తికేయన్ బిజీ హీరో అయ్యారు. రెమో చిత్రంతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ కి టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పడింది.
కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ఒకరిగా శివ కార్తికేయన్ ఎదిగారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ 'డాక్టర్' భారీ సక్సెస్ కొట్టింది. తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకున్న డాక్టర్ తమిళ్ లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ 25 కోట్ల రూపాయలకు పైనే తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు శివ కార్తికేయన్ 19 చిత్రాలు చేశారు. డాన్, అయలాన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ కి రూ. 150 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో రెండు లగ్జరీ హౌస్ లు ఉన్నాయి.. వాటి విలువ 20 కోట్లకు పైమాటే. దాదాపు 7 కార్లు ఉండగా... వాటి విలువ ఆరు కోట్ల రూపాయల ఉంటుందట.