Takkar Movie Review:టక్కర్ మూవీ రివ్యూ.. సిద్దార్ధ్ అనుకున్నది సాధించాడా..?
ఒకప్పుడు తన నోటి దురుసువల్ల టాలీవుడ్ లో అవకాశాలు కోల్పోయిన హీరో సిద్దార్ధ్.. ఇప్పుడు మళ్ళీ తెలుగులో యాక్టీవ్ అవ్వాలి అని చూస్తున్నాడు అందులో భాగంగానే .. తమిళ్ లో తాను నటించిన టక్కర్ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఈరోజు(09 జూన్) రిలీజ్ అవుతున్న ఈమూవీ ప్రీమియర్ షోస్ యూఎస్ లో సందడి చేస్తున్నాయి. మరి మూవీ రివ్యూ ఏంటో చూసేద్దామా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఒకప్పటి లవర్ బాయ్ సిద్ధార్థ్ ప్రయోగాలు చేస్తున్నారు. విజయాల కోసం అన్ని రకాల సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ టక్కర్. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధార్థ్, దివ్వాన్ష కౌశిక్ జంటగా నటించిన ఈసినిమాలో సిద్దు కంప్లీట్ డిఫరెంట్ అవతారం లో కనిపిస్తున్నారు.
కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన టక్కర్ చిత్రాన్నితెలుగులో టీవీ విశ్వప్రసాద్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న టక్కర్ సినిమాకు నివాస్ కే ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యోగిబాబు కీలక కీలకపాత్రలో కనిపించగా.. ఈసినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్ డేట్ మూవీపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
ఇక కథ విషయానికి వస్తే.. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే పేద యువకుడి పాత్రలో సిద్దార్ధ్ నటించారు. డబ్బు సంపాదన కోసం, ధనవంతుడు కావాలన్న ఆశతో ఆ యువకుడు ఎలాంటి రూట్ ను ఎంచుకున్నాడు. వాటి వల్ల పర్వవసానాలు ఏంటీ.. ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడు అనేది కథ. సినిమాలో మాఫీయా, యాక్షన్ తో పాటు సిద్దార్ధ్ రొమాన్స్ డోస్ కూడా గట్టిగా ఇచ్చాడీ సినిమాలో.
సిద్ధార్థ్ అంటే అందరికి ఇప్పటికీ బొమ్మరిల్లు క్యూట్ లుక్ కనిపిస్తుంది. లేదంటే.. నువ్వోస్తానంటే నేనోద్దంటానా లో ఉన్నట్టుగా లేత కుర్రాడి ఆకారం మదిలో మెదులుతుంది కాని ఈసినిమాలో సిద్దు లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అసలు ఆయన సిద్దునేనా అనేలా ఉన్నాడీ సినిమాలో. అంతే కాదు సినిమాలో సిద్దార్ధ్ పర్ఫామెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో చేయాలని ఆత్రంలో.. ఇంకేదో చేసేశాడు హీరో.
ఈసినిమా ఫస్ట్ హాప్ కొంత వరకూ చూడగలిగేలా ఉన్నా.. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా సినిమాపై హోప్ లెస్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసి.. కాస్త బెటర్ గా ఉంది.. సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా కథలో విలన్ పాత్ర కన్విన్సింగ్‌గా లేదు. ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ సిద్దు. ఈసినిమాకు సిద్దు పెర్ఫామెన్స్ ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.
అంతే కాదు సిద్దార్థ్ స్క్రీన్ ప్రజెన్స్ ఆడిమన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందన్న విమర్షలు వినిపిస్తున్నాయి. టక్కర్ ఫస్ట్ హాఫ్‌లో ఏమాత్రం పసలేని సన్నివేశాలు , ఓవర్-ది-టాప్ యాక్షన్ బ్లాక్‌లు ఎక్కువగా ఉన్నాయి. సిద్దు ఎంట్రీ తరువాత వెంటనే కొద్దిసేపటికి ప్లాప్ బ్యాక్ సీన్ ఓపెన్ అవుతుంది.
ఇక ఈసినిమాలో యాక్షన్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి.. మాఫియా బ్యాక్ డ్రాప్ సీన్లతో పాటు.. అడల్ట్ కంటెంట్ కి కూడా కొదవలేదు. హీరోయిన్ దివ్యాన్ష తో కలిసి సిద్దు.. బెడ్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలలో సిద్దార్థ్ రెచ్చిపోయి నటించాడు. ఆమెతో సిద్దార్థ్ బోల్డ్ సన్నివేశాలు సెగలు పుట్టిస్తాయి అనిచెప్పాలి. ఈసారి సక్సెస్ కోసం.. సిద్దులో కనిపించిన కొత్త కోణం ఇది అని చెప్పోచ్చు.
ఇక కార్తీక్ జి క్రిష్ డైరెక్షన్ కాని.. నివాస్ మ్యూజిక్ కాని.. సినిమాకు ఏమాత్రం ప్లస్ అవ్వలేదనే చెప్పాలి. సిద్దార్థ్ కోసం సినిమాకి వెళ్లిన వారికి రకరకాల అనుభవాలు మాత్రం మిగులుతాయి అనడంతో ఆశ్చర్యం లేదు. మహాసముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు తెరపై మళ్లీ బిజీ అవుదామనుకున్నాడుసిద్దు. మరి ఈసినిమా ఈరోజు రిలీజ్అయ్యి.. ఓవర్ ఆల్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.