Sharwanand : శర్వానంద్ వదులుకున్న ఇండస్ట్రీ హిట్ మూవీ... అది గనుక చేసి ఉంటేనా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) నెక్ట్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే శర్వానంద్ గతంలో ఓ సినిమా చేసి ఉంటే మాత్రం ప్రస్తుతం లెక్కలు వేరేలా ఉండేవి.

20 ఏళ్లకు పైగా సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు మన హ్యాండసమ్ హీరో శర్వానంద్. గతేడాది పెళ్లి పీటలు కూడా ఎక్కి జీవితంలో మరొక్క అడుగు ముందుకు వేశారు. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
రీసెంట్ గా శర్వానంద్ దంపతులకు కూతురు కూడా పుట్టడం విశేషం. ఈ గుడ్ న్యూస్ తో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయిన విషయం తెలిసిందే. ఇక ఇటు సినిమాల పరంగానూ ప్రస్తుతం స్పీడ్ అప్ అయ్యారు.
2003 నుంచి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న శర్వానంద్ ఎన్నో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో నటించారు. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలకే ప్రియార్టీ ఇచ్చారు. అలాగే లవ్ స్టోరీలతోనూ యువతను ఆకట్టుకున్నారు.
అయితే శర్వానంద్ ఓ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని వదులుకున్నారు. అదే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vang) దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy). ఈ చిత్రం అసలు మన శర్వా చేయాల్సిందేనంట.
కానీ అప్పట్లో పలు కారణాలతో రిజెక్ట్ చేయడంతో విజయ్ కి అవకాశం దక్కింది. కానీ అప్పుడే శర్వానంద్ ఈ సినిమా చేసి ఉంటే మాత్రం ఇప్పుడు రేంజ్ వేరేలా ఉండేదని... ఇండస్ట్రీలో లెక్కలన్నీ మార్చేవాడని అంటున్నారు.
చివరిగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘ఓకే ఒక జీవితం’ వంటి చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం శర్వా35లో నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు.