MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది... ఉపాసన ప్రెగ్నెన్సీపై షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్!

నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది... ఉపాసన ప్రెగ్నెన్సీపై షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన చరణ్!

హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె గర్భం దాల్చడానికి జపాన్ కారణం అన్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 25 2023, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రామ్ చరణ్ జీ 20 సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ గౌరవం అందుకున్న ఏకైన ఇండియన్ హీరోగా ఆయన రికార్డులకు ఎక్కారు. జమ్మూ అండ్ కాశ్మీర్ వేదికగా జరిగిన జీ 20 సదస్సులో రామ్ చరణ్ పలు విషయాలపై మాట్లాడారు. అలాగే వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్న ఆయన ఉపాసన ప్రెగ్నెన్సీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జపాన్ దేశంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసే క్రమంలో రామ్ చరణ్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నాకు పుట్టబోయే బిడ్డకు జపాన్ తో సంబంధం ఉంది. ఈ మ్యాజిక్ అంతా జరిగింది జపాన్ లోనే. అందుకు నాకు జపాన్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఆ దేశం అంటే నాకు చాలా ఇష్టం , అన్నారు. 

37


నాకు యూరప్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జపాన్ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా భార్య ఉపాసనకు ఏడో నెల. ఈ మ్యాజిక్ జరిగింది అక్కడే. జపాన్ దేశం, ప్రజలు, వారి సంస్కృతి నాకు ఎంతో ఇష్టం, అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

47
Ram Charan Upasana

Ram Charan Upasana

గత ఏడాది జపాన్ దేశంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్-ఉపాసన అక్కడికి వెళ్లారు. ఆ సమయంలోనే ఉపాసన గర్భం దాల్చారని రామ్ చరణ్ చెప్పుకొస్తున్నారు. కాగా చరణ్-ఉపాసన వివాహం చేసుకొని పదేళ్లు దాటిపోయింది. వీరు చాలా ఆలస్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2022 డిసెంబర్ నెలలో ఉపాసన గర్భం దాల్చినట్లు తెలియజేశారు. ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా వారసుడు వస్తున్నాడన్న వార్తను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. 

57


అయితే ఈ పదేళ్ల జర్నీలో పిల్లల విషయంలో రామ్ చరణ్ దంపతులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. పలు విమర్శలు, పుకార్లు తెరపైకి రాగా వాటన్నింటినీ భరించారు. ఈ విషయాలపై ఉపాసన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'వివాహం జరిగినప్పుడే చరణ్, నేను  పదేళ్ల వరకు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాము. మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేశాము. ఇప్పుడు ఇద్దరం మా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగాము. ఆర్థికంగా స్థిరపడ్డాము. మా పిల్లలకు ఏ లోటు లేకుండా అడిగింది ఇవ్వగలము' అని ఉపాసన అన్నారు.

67

'పిల్లల విషయంలో సమాజం, కుటుంబ సభ్యుల ఒత్తిడికి మేము తలొగ్గలేదు. ఇది మా మధ్య బంధాన్ని, అవగాహనను మరింత బలపరిచింది. సమాజంతో పని లేకుండా మేము కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులం అయ్యాము' అని ఉపాసన చెప్పారు. గతంలో కూడా ఉపాసన ఇదే తరహా కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడం పెద్ద బాధ్యత. వాళ్ళను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే సరిపోదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి, కోరింది సమకూర్చడానికి మనం సిద్ధం కావాలి. అవగాహన పెంచుకోవాలని చెప్పారు. 
 

77

ఇక ఉపాసన అమెరికాలో ప్రసవిస్తారని ఓ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆమె ఖండించారు. ఇండియాలోని అపోలో హాస్పిటల్స్ తనకు డెలివరీ జరుగుతుందని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో ఉపాసన సీమంత వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved