MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫుల్లుగా తాగి రాఘవేంద్రరావుని కొట్టడానికి వెళ్లిన హీరో రాజశేఖర్‌.. మరదలి కోసం అంత పెద్ద గొడవ అయ్యిందా?

ఫుల్లుగా తాగి రాఘవేంద్రరావుని కొట్టడానికి వెళ్లిన హీరో రాజశేఖర్‌.. మరదలి కోసం అంత పెద్ద గొడవ అయ్యిందా?

తన ఇమేజ్‌నే మార్చేసిన దర్శకుడు కె రాఘవేంద్రరావుతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు హీరో రాజశేఖర్‌. సెట్‌లో పెద్ద రచ్చ అయ్యింది. ఆ విషయం చెబుతూ కన్నీళ్లుపెట్టుకున్నాడు స్టార్‌ హీరో. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 01 2024, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలకు లైఫ్‌ ఇచ్చాడు. కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌లు ఇవ్వడమేకాదు, స్టార్లని చేశాడు. అప్పట్లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేశాడు. అందరికి హిట్లు ఇచ్చాడు. వారి కెరీర్‌నే మలుపుతిప్పాడు. ఎన్టీఆర్‌ నుంచి అల్లు అర్జున్‌ వరకు ఎంతో మంది రాఘవేంద్రరావుతో సినిమాలు చేసి హిట్‌ కొట్టినవాళ్లే. కమర్షియల్‌ స్టార్స్ గా ఎదిగినవాళ్లే. 
 

27

 వారిలో హీరో రాజశేఖర్ కూడా ఒకరు. రాఘవేంద్రరావు ఆయన కెరీర్‌నే మార్చేశాడు. యాంగ్రి యంగ్‌ మేన్‌ ఇమేజ్‌తో రాణిస్తున్న రాజశేఖర్‌ తో `అల్లరి ప్రియుడు` వంటి రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాని తీసి హిట్‌ కొట్టాడు. రాజశేఖర్‌కి బిగ్‌ హిట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఆయన ఇమేజ్‌నే మార్చేశాడు. యాంగ్రి యంగ్‌ మేన్‌ నుంచి రొమాంటిక్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చాడు. ఈ సినిమాతో రాజశేఖర్‌ కెరీర్‌ కూడా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అది రాజశేఖర్‌కి లైఫ్‌ టర్నింగ్‌ మూమెంట్. 

37

అలాంటి హిట్‌ ఇచ్చిన, లైఫ్‌ మార్చేసిన దర్శకుడితో రాజశేఖర్‌ గొడవ పడటం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. తాగేసి రాజశేఖర్‌.. రాఘవేంద్రరావు మీదకు వెళ్లాడట. తిట్టుకోవడమే కాదు, కొట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అందరి ముందు రాఘవేంద్రరావుని రాజశేఖర్‌ కొట్టాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు మనుషులు రాజశేఖర్‌ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని పోయారని అన్నారు. 
 

47

అయితే గొడవపై రకరకాల రూమర్లు ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్‌. అసలేం జరిగింది, ఎందుకు జరిగింది. నిజంగానే కొట్టారా? అందులో తప్పు ఎవరిది అనేది వెల్లడించారు. జీవిత, రాజశేఖర్‌ మొదట్లో చెన్నైలోనే ఉండేవాళ్లు. ఆ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావు కూడా హైదరాబాద్‌ కి వచ్చాడు. ఆ సమయంలో తన పిల్లలను చూసుకునేందుకు చెల్లిని, తల్లిని హైదరాబాద్‌కి తీసుకొచ్చింది జీవిత. అడపాదడపా ఆమె సినిమాల షూటింగ్‌లకు వచ్చేదట. 
 

57

ఈ క్రమంలో ఓ సారి ఆమె రాఘవేంద్రరావుని సెట్‌లో కలిసిందట. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆమెని సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు అన్నాడట. సీరియల్స్, సినిమాలు చేస్తే బాగుంటుందన్నారట.  అంతేకాదు ఆమెని సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు ప్లాన్‌ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం రాజశేఖర్‌కి చేరింది. తన మరదలిని రాఘవేంద్రరావు వాడుకోబోతున్నట్టుగా, ఆమెని ఛీట్‌ చేయబోతున్నట్టుగా రాజశేఖర్‌కి ఎక్కించారట. 
 

67

దీంతో తాగేసి ఉన్న రాజశేఖర్‌..ఆ కోపంలో, ఆవేశంలో రాఘవేంద్రరావు మీదకు వెళ్లాడట. పెద్ద గొడవ పెట్టుకున్నాడట. తన మరదలితో ఏంటి పని అంటూ ఫైర్‌ అయ్యాడట‌. రాజశేఖర్‌ గట్టిగా అరవడంతో పెద్ద గొడవలా ప్రొజెక్ట్ అయ్యింది. దీంతో మీడియా దాన్ని మరింత హైలైట్‌ చేసి రాసింది. అది మరింత పెద్దగా మారిపోయింది. అయితే ఆ తర్వాత అసలు నిజం తెలిసిందని, ఆ విషయంలో రాఘవేంద్రరావు తప్పేమీ లేదని, తానే ఆవేశంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆయనపైకి వెళ్లానని, తనదే తప్పు అని చెప్పాడు రాజశేఖర్‌. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో తెలిపారు. 
 

77

అయితే అలా చెప్పింది ఒక హీరోయిన్‌ అని, ఆమె రాజశేఖర్‌పై క్రష్‌ ఉండేదని, కానీ ఎప్పుడూ జీవిత పక్కనే ఉండటంతో తట్టుకోలేకపోయిందని, ఇలా తమ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిందని జీవిత వెల్లడించింది. ఆమె కారణంగానే రాఘవేంద్రరావుతో గొడవ పడ్డానని చెప్పాడు రాజశేఖర్‌. ఈ సందర్భంగా ఆయన టాక్‌షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ గొడవని సెట్‌ చేయడంకోసం చిరంజీవి, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కలిసి జరిగింది చెప్పారట. ఆయన్ని కలవాలనుకున్నట్టు చెప్పారట. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదని,  తర్వాత తనే వెళ్లి రాఘవేంద్రరావుని కలిసి సారీ చెప్పామని తెలిపింది జీవిత. సారీ చెప్పాం కానీ ఆయన మర్చిపోలేదని, ఇప్పటికీ అది మనసులో ఉండిపోతుందని, అదే గిల్టీ ఫీలింగ్‌ ఇప్పటికీ తనలో ఉండిపోయిందని రాజశేఖర్‌ చెప్పారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు, చిరంజీవి ఖైదీ.. ఈ రెండు హిట్లలో ఏది బెస్ట్.?
Recommended image2
Brahmamudi Today Episode: ఇరుక్కున్న స్వాతి, ఇందు.. రేఖపై పగతో నందు
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 10 ఎపిసోడ్: రామరాజుని నోటికొచ్చినట్టు తిట్టిన సాగర్, అడ్డుకున్న నర్మద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved