MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ పెళ్లికి షాపింగ్ ఎక్కడో ఫిక్స్ చేసిన పెద్దమ్మ శ్యామలాదేవి... డార్లింగ్ కి అమ్మాయి దొరికిందా?

ప్రభాస్ పెళ్లికి షాపింగ్ ఎక్కడో ఫిక్స్ చేసిన పెద్దమ్మ శ్యామలాదేవి... డార్లింగ్ కి అమ్మాయి దొరికిందా?

ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఎక్కడో డిసైడ్ చేసింది పెద్దమ్మ శ్యామలాదేవి. కాబోయే కోడలికి ఖరీదైన పట్టు చీరలు కొంటుందట. ప్రభాస్ పెళ్లి మీద శ్యామలాదేవి హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 29 2024, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్ నాలుగు పదుల వయసు ఎప్పుడో దాటేశాడు. ప్రభాస్ ఈ పాటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి కావాల్సింది. ప్రభాస్ తోటి హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సకాలంలో పెళ్లి చేసుకుని వారసులను కన్నారు. ప్రభాస్ మాత్రం ఆ ఊసు ఎత్తడం లేదు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా? అనే సందేహం అందరిలో ఉంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్, పెళ్లి దిశగా ఆలోచన చేస్తున్నారనిపించడం లేదు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ప్రభాస్. తాజాగా కల్కి తో వసూళ్ల వర్షం కురిపించాడు. కల్కి వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. 
 

36

ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల జాబిత పెద్దగా ఉంది. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ కొంత మేర షూటింగ్ జరుపుకుంటుంది. సలార్ 2, దర్శకుడు హనురాఘవపూడితో ఒక చిత్రానికి ప్రభాస్ కమిట్ అయ్యాడని సమాచారం. కాబట్టి రానున్న మూడు నాలుగేళ్లలో ప్రభాస్ షెడ్యూల్స్ ఫుల్ బిజీ. మరి పెళ్లి చేసుకునే తీరిక ఎక్కడ?
 

46
Prabhas

Prabhas

ప్రభాస్ గతంలో పెళ్లి పై స్పందించారు. దానికి ఇంకా సమయం రావాలని అన్నారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య గట్టిగా నిలదీస్తే... అమ్మాయి దొరకడం లేదు. సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని సిల్లీ సమాధానాలు చెప్పి తప్పుకున్నాడు. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ వివాహం మీద గట్టి విశ్వాసంతో ఉన్నారు.

56
Prabhas

Prabhas

ప్రభాస్ కి పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని పలుమార్లు చెప్పిన శ్యామలాదేవి తాజాగా కీలక కామెంట్స్ చేసింది. నటుడు కృష్ణుడు భార్య గాయత్రీ, అభిలాష రెడ్డి అనే మరొక మహిళతో కలిసి హైదరాబాద్ లో చీరల వ్యాపారం ప్రారంభించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ కి శ్యామలాదేవి, హైదరాబాద్ మేయర్, పలాస మూవీ ఫేమ్ రక్షిత్ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు. 
 

66

నాకు పట్టు చీరలు అంటే చాల ఇష్టం. కృష్ణంరాజు నాకు మొదటిసారి కంచిపట్టు చీర కొనిచ్చారు. నేను ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే చేస్తాను. ఈ స్టోర్ లో మంచి శారీ కలెక్షన్ ఉందని అన్నారు. శ్యామలాదేవి మాటలు విన్న అభిమానుల్లో ప్రభాస్ పెళ్లి పై ఆశలు చిగురించాయి. ఆమె మాటవరసకు అన్నారా? లేక ప్రభాస్ ఏమైనా హామీ ఇచ్చాడా? అనేది తెలియదు..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved