- Home
- Entertainment
- Karthikeya2 Censor Talk: కార్తికేయ 2 సెన్సార్ రిపోర్ట్... మైండ్ బ్లోయింగ్ టాక్.. హైలెట్స్ అవేనట!
Karthikeya2 Censor Talk: కార్తికేయ 2 సెన్సార్ రిపోర్ట్... మైండ్ బ్లోయింగ్ టాక్.. హైలెట్స్ అవేనట!
యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. విడుదలకు సిద్ధమైన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోగా టాక్ బయటికి వచ్చింది. మరి నిఖిల్ ప్రతిష్టాత్మకంగా నటించిన కార్తికేయ 2 ఎలా ఉందో చూద్దాం...

Karthikeya 2
హ్యాపీ డేస్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి చిత్రాలు ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. నిఖిల్(Nikhil) కి పరిశ్రమలో కొంత మార్కెట్ ఏర్పడింది. ఆయన నటించిన అర్జున్ సురవరం సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది.
Karthikeya 2
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ పెద్ద హిట్. ఆ సినిమా కాన్సెప్ట్, టేకింగ్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా కార్తికేయ మంచి మార్కులు రాబట్టింది. 2014లో విడుదలైన ఈ మూవీలో స్వాతి హీరోయిన్ గా నటించారు. నిఖిల్ కి బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి.
Karthikeya 2
కార్తికేయ చిత్రం తర్వాత దర్శకుడు చందూ మొండేటి అదే టైటిల్ తో ప్రేమమ్ రీమేక్ తెరకెక్కించాడు. అనంతరం ఆయన డైరెక్షన్ లో వచ్చిన సవ్యసాచి ఘోరంగా దెబ్బతింది. ఒక విధంగా చందూ మొండేటి ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఆయన లేటెస్ట్ మూవీ బ్లడీ మేరీ ఓటీటీ లో విడుదలైంది.
Karthikeya 2
కాగా కార్తికేయ సీక్వెల్ పై చందూ మొండేటి చాలా కాలంగా వర్క్ అవుట్ చేస్తున్నారు. ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లిన ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. జులై 22న విడుదల కావాల్సిన కార్తికేయ 2(Karthikeya 2) అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆగస్టు 12 కొత్త విడుదల తేదీగా చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇక సినిమాలో ఒక్క కట్ కూడా చెప్పకుండా సభ్యులు పాస్ చేసినట్లు సమాచారం. అలాగే టీం పాజిటివ్ రివ్యూ ఇచ్చారట.
సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి. కథ, స్క్రీన్ ప్లే తో పాటు లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగుందని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. సెన్సార్ టీమ్ ఒపీనియన్ విన్నాక టీమ్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారట. మూవీ విజయంపై మరింత నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా కార్తికేయ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో నటించడం విశేషం. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.