మిరాయ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. భారీ బ్లాక్‌బస్టర్ మిస్సయ్యాడుగా..
Mirai Movie: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మిరాయ్’. మొదటి ఈ కథను న్యాచులర్ స్టార్ నాని అంగీకరించినా, రెమ్యూనరేషన్ కారణంగా ప్రాజెక్ట్ మిస్ అయ్యిందట.

మైథలాజికల్ థ్రిల్లర్
Mirai Movie: ‘హనుమాన్’వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జ నటించిన మూవీ ‘మిరాయ్’. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మిరాయ్’మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్పాఫీస్ వద్ద దూసుకపోతుంది. మరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్దమైంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే..? ఈ సినిమాకి మొదటి హీరో తేజ సజ్జ కాదట. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడేళ్ల కిందట రాసుకున్న కథను ముందుగా ఓ స్టార్ హీరో కు చెప్పారంట. ఇంతకీ ఆ హీరో ఎవరు? కారణమేంటీ?
ఫాంటసీ యాక్షన్ విజువల్ వెండర్
‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన తాజా చిత్రం ‘మిరాయ్ (Mirai)’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కింది. నిర్మాతలుగా టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వ్యవహరించారు.
మిరాయ్ మూవీ రివ్యూ
మిరాయ్ సినిమాలో తేజ యాక్టింగ్ మెచ్యూర్డ్‌గా, ప్రత్యేకంగా పోరాట సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. మంచు మనోజ్ తో నటించిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే, ప్రభాస్ (Rebel Star) ఎంట్రీ సీన్ సినిమాలోని ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లోనే మేకర్స్ అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ కు ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు.
ఊహించని రెస్పాన్స్
సినిమా ప్రేమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతూ సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ‘మిరాయ్’తో తేజ మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు’ అని తెలిపారు. మొత్తం విషయాన్ని పరిశీలిస్తే, ఈ సినిమా తేజా కోసం మంచి ఛాన్స్ కావడమే కాకుండా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథను ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకరావడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
మిరాయ్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడు సంవత్సరాల క్రితమే రాసుకున్నారు. తొలుల ఈ కథను స్టార్ హీరో నాని (Nani)కు చెప్పారట. ఈ కథను నాని సానుకూలంగా స్పందించనా, రెమ్యూనరేషన్ తేడాల కారణంగా నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న తేజ సజ్జ దగ్గరకు వచ్చింది. వెంటనే తేజ అంగీకరించారు. ఫైనల్ రిజల్ట్ ఈ రోజు వచ్చింది. ఇలా తేజ సజ్జ తన ఖాతాలో మరో సక్సెస్ వేసుకున్నారనే చెప్పాలి.