- Home
- Entertainment
- మిరాయ్ ట్విట్టర్ రివ్యూ, సూపర్ హీరోగా తేజ సజ్జా, ప్రభాస్ సర్ ప్రైజ్ వర్కౌట్ అయ్యిందా? హనుమాన్ రేంజ్ లో ఆడుతుందా?
మిరాయ్ ట్విట్టర్ రివ్యూ, సూపర్ హీరోగా తేజ సజ్జా, ప్రభాస్ సర్ ప్రైజ్ వర్కౌట్ అయ్యిందా? హనుమాన్ రేంజ్ లో ఆడుతుందా?
Mirai Twitter Review: తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ మిరాయ్. ఈసినిమా ఈరోజు రిలీజ్ అవుతుండగా, ప్రీమియర్స్ షో ద్వారా సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

మిరాయ్ ట్విట్టర్ రివ్యూ
Mirai Twitter Review : టాలీవుడ్ కు సూపర్ హీరోలా తయారయ్యాడు తేజ సజ్జా, మిరాకిల్స్ చేస్తున్నాడు, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్ సినిమాతో, పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజ్, తాజాగా మిరాయ్ తో మరోసారి మిరాకిల్ చేయడానికి వచ్చేశాడు. పైగా ప్రభాస్ ఎంట్రీతో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్. హనుమాన్ మూవీ తర్వాత తేజ్ చేస్తున్న ప్రతీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే హనుమాన్ మూవీ తర్వాత జై హనుమాన్ సినిమా రావాల్సి ఉంది. కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడడంతో తేజ్ మిరాయ్ సినిమాతో పలకరించాడు. ఇక ఈసినిమా ఈరోజు రిలీజ్ అవుతుండగా.. ప్రీమియర్స్ సందడి మొదలయ్యింది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి ఈసినిమా పై వారి అభిప్రాయం ఏంటీ అనేది ట్విట్టర్ రివ్యూ ద్వారా చూసేద్దాం.
పురాణాల ఆధారంగా
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించారు. ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన ఈసినిమా పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ మూవీగా రూపొందింది. ఫస్ట్ టైమ్ శ్రీయా తల్లి పాత్రలో నటించారు.
పాజిటీవ్ రివ్యూస్
మిరాయ్ పై ఎక్కువగా పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. గ్రాఫిక్స్ కూడా క్వాలిటీగా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మూవీ మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలెట్. బ్లాక్ బస్టర్ మూవీ అంటూ కొంత మంది ఆడియన్స్ ట్వీట్ చేశారు. తేజ్ సజ్జ యాక్టింగ్ కు ప్రశంసలు కూడా వస్తున్నాయి. తేజ్ సక్సెస్ ఇలానే కంటీన్యూ అవుతుంది అంటూ బ్లెస్ చేస్తున్నారు.
ప్రభాస్ సర్ ప్రైజ్
ఇక ఈసినిమాలో సర్ ప్రైజింగ్ అంశం ప్రభాస్. అసలు ఎవరు ఊహించని విధంగా ఈసినిమాలో ప్రభాస్ కనిపించారు. దాంతో ఒక్క సారిగా సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఈ విషమంలో తేజ్ సజ్జా చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా తేజ్ ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్వీట్టర్ లో కూడా ప్రభాస్ పాత్రపై ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ప్రభాస్ అద్భుతం చేశారంటున్నారు ట్విట్టర్ ఆడియన్స్.
ఒక్క వాయిస్ ఓవర్
కేవలం ఒక్క వాయిస్ ఓవర్ సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసింది. డార్లింగ్ ప్రభాస్ పేరు ఉంటే చాలు సినిమా సక్సెస్ ను ఎవరు ఆపలేరన్నట్టుగా ఓ అభిమాని ట్వీట్ చేశారు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూడలేని సెపరేట్ ఫ్రేమ్ ప్రభాస్ ది. ఈసినిమాలో ఇంకా అద్భుతం చేశాడు, సెపరేట్ గారెభల్ హుడ్ నే నడుపుతున్నాడు ప్రభాస్ అంటూ ఓ అభిమాని అన్నారు. మిరాయ్ లో ప్రభాస్ కనిపించడంతో సినిమా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
సూపర్ హిరోగా తేజ సజ్జా
మిరాయ్ నిజంగా విజ్యువల్ వండర్, ఇది మరో హనుమాన్ సినిమా అవుతుంది. అంతకు మించి విజయం సాధిస్తుంది. మిరాయ్ నిజంగా అద్భుతం. థియేటర్ మిరాయ్ సీన్స్ తో దద్దరిల్లిపోతున్నాయి. అంటూ ప్రేక్షకుడు ఒకరు ట్వీట్టర్ లో వెల్లడించారు. తేజ్ సజ్జాతో పాటు మంచు మనోజ్ నటనపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ఓవర్ ఆల్ గా ట్విట్టర్ లో అన్నీ పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. తేజ సజ్జా టాలీవుడ్ సూపర్ హీరోగా మారిపోయాడు. దాంతో మిరాయ్ సినిమా నిజంగా మిరాకిల్ చేస్తుందని నమ్ముతున్నారు టీమ్. మరి ఫైనల్ రన్ లో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి.