- Home
- Entertainment
- లేడీ బాస్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నమ్రత శిరోద్కర్... మహేష్ ఫీలింగ్ ఏంటో?
లేడీ బాస్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నమ్రత శిరోద్కర్... మహేష్ ఫీలింగ్ ఏంటో?
నమ్రత శిరోద్కర్ వయసుకు సవాల్ విసురుతుంది. యాభై ఏళ్ళు దాటినా యంగ్ లుక్ లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. మహేష్ బాబుకి తన గ్లామర్ తో పోటీ ఇస్తుంది.

Namrata Shirodkar
నమ్రత శిరోద్కర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఫేమస్ మోడల్ కూడాను. పలు అందాల పోటీల్లో పాల్గొంది. ఆమె మన టాలీవుడ్ అందగాడు మహేష్ బాబును చూడగానే పడిపోయింది.
Namrata Shirodkar
మహేష్ బాబు-నమ్రత కలిసి వంశీ చిత్రంలో నటించారు. ఆ మూవీ సెట్స్ లో ప్రేమలో పడ్డారు. షూటింగ్ చివరి రోజు ఒకరిపై ప్రేమను మరొకరు వ్యక్తపరుచుకున్నారు. దాదాపు ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు.
Namrata Shirodkar
2005లో నమ్రత-మహేష్ అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మహేష్ పెళ్లి వార్త అప్పట్లో సంచలనం రేపింది.
Namrata Shirodkar
వివాహం అనంతరం నటనకు నమ్రత గుడ్ బై చెప్పేసింది. వీరికి గౌతమ్, సితార సంతానం. పిల్లలు పెద్దయ్యాక నమ్రత మహేష్ కి వ్యక్తిగత సలహాదారుగా మారింది. మహేష్ సంపాదనను అనేక వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతుంది.
Namrata Shirodkar
నమ్రత ఫిట్నెస్ ఫ్రీక్. అందంగా నాజూగ్గా కనిపించాలని కోరుకుంటుంది. అందుకోసం స్ట్రిక్ట్ డైట్ పాటిస్తుంది. ప్రతి రోజూ వ్యాయామం చేస్తుంది. ప్రస్తుతం నమ్రత వయసు 52 ఏళ్ళు. ఆమెకు అంత వయసు ఉందంటే నమ్మడం కష్టమే.
Namrata Shirodkar
తాజాగా లేడీ బాస్ గెటప్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది. నమ్రత ఫోటో షూట్స్ పై మహేష్ బాబు తన అభిప్రాయం షేర్ చేస్తూ ఉంటారు. మరి నమ్రత లేటెస్ట్ లుక్ చూసిన మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి...