అందంలో అమ్మ నమ్రతకు పోటీ ఇస్తున్న సితార... మహేష్ క్యూట్ డాటర్ బ్యూటిఫుల్ వైఫ్!
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార కలిసి ట్రెడిషనల్ ఫోటో షూట్ చేశారు. సితార-నమ్రత ఒకే ఫ్రేమ్ లో అద్భుతం చేశారు. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Namrata Shirodkar - Sitara
సూపర్ స్టార్ మహేష్ బాబుకి అందమైన ఫ్యామిలీ ఉంది. 2005లో నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకోగా గౌతమ్, సితారలు సంతానం కలిగారు. ఇద్దరు పిల్లలు చందమామల్లా అందంగా ఉంటారు.
Namrata Shirodkar - Sitara
సితార అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. తనకంటూ సపరేట్ ఇమేజ్ మైంటైన్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో సితారను మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. సితార తరచుగా డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్, వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
Namrata Shirodkar - Sitara
నమ్రత వయసు ఐదు పదులు దాటినా స్టిల్ యంగ్ కాలేజ్ గర్ల్ లుక్ మైంటైన్ చేస్తుంది. కఠిన వ్యాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ నమ్రత ఫిట్ అండ్ స్లిమ్ గా ఉంటున్నారు.
Namrata Shirodkar - Sitara
ఓ ప్రమోషనల్ షూట్ లో సితార, నమ్రత కలిసి పాల్గొన్నారు. పట్టుబట్టల్లో సంప్రదాయంగా కనిపించారు. అందంలో నమ్రతను మించిపోయింది సితార. అమ్మానాన్నలకు తగ్గ కూతురు అనిపిస్తుంది.
సితార అప్పుడే మోడల్ గా రాణిస్తుంది. ఇటీవల సితార పీఎంజే అనే ఓ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. సితార ఈ యాడ్ చేసినందుకు కోటి రూపాయల వరకు ఛార్జ్ చేసిందట
.
సితార పేరిట కొందరు ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన మహేష్ బాబు ఫ్యామిలీ వెంటనే చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో కేసు పెట్టారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
ఇక గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసిన మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో చిత్రం చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఇది ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.