మహేష్ మరదలు కూడా స్టార్ హీరోయినే.. ఆమె నటించిన ఏకైన టాలీవుడ్ హీరో ఎవరంటే!
మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కూడా స్టార్ హీరోయినే. తెలుగులో ఆమె ఒకే చిత్రం చేయగా ఆమె గురించి ఈ తరం ఆడియన్స్ కి పెద్దగా తెలియదు.

Namrata Shirodkar
అక్క నమ్రతా శిరోద్కర్ కంటే ముందు వెండితెరకు పరిచయమైంది శిల్పా శిరోద్కర్. 1989లో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా విడుదలైన బ్రష్టాచార్ చిత్రంలో నటించారు. అనంతరం వరుసగా హిందీలో చిత్రాలు చేశారు. 90లలో శిల్పా బాలీవుడ్ లో కొంత మేర ప్రభావం చూపించారు. సంజయ్ దత్, అనిల్ కపూర్ వంటి స్టార్స్ తో జతకట్టారు.
1998 వరకూ ఏడాదికి మూడు నాలుగు చిత్రాల్లో శిల్పా శిరోద్కర్ నటించారు. ఈమెను టాలీవుడ్ కి మోహన్ బాబు ఇంట్రడ్యూస్ చేశారు. 1992లో విడుదలైన బ్రహ్మ చిత్రంలో శిల్పా శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు. బ్రహ్మ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. శిల్పా గ్లామర్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే మళ్ళీ ఆమె తెలుగులో చిత్రాలు చేశారు.
మేకర్స్ ఆఫర్స్ ఇచ్చినా రిజెక్ట్ చేశారనే వాదన ఉంది. కెరీర్ పూర్తిగా డల్ అయ్యాక శిల్పా యూకేకి చెందిన బ్యాంకర్ ఆపరేశ్ రంజిత్ ని 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో ఒక అమ్మాయి పుట్టింది.కూతురు పేరు అనుష్క. విదేశాల్లోనే శిల్పా సెటిల్ అయ్యారు. ఇక మహేష్ ఫ్యామిలీని విదేశీ టూరుల్లో శిల్పా ప్రత్యేకంగా కలుస్తారు.
Namrata Shirodkar
ఇండియా వస్తే అక్క శిల్పాను తప్పకుండా మీట్ అవుతారు. తరచుగా మహేష్-శిల్పా ఫ్యామిలీ దుబాయ్ వేదికగా కలుస్తుంటారు. తాజాగా నమ్రత చెల్లి శిల్పాను కలిసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 'నా చిన్న చెల్లి పక్కన ఉంటే చాలు', అంటూ కామెంట్ పెట్టారు. వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ పోస్ట్ చేశారు.
Namrata Shirodkar
నమ్రతకు 51ఏళ్ల వయసు కాగా శిల్పాకు 49 ఏళ్ళు. వారి లుక్స్ మాత్రం 25-30 వద్దే ఆగిపోయాయి. అంత యంగ్ అండ్ ఫిట్ గా కనిపిస్తారు. వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ వయసు దరిచేరనీయడం లేదు ఈ సిస్టర్.
హీరోయిన్స్ గా కెరీర్స్ లో రాణించిన ఈ సూపర్ సిస్టర్స్ పెళ్లయ్యాక గృహిణులుగా మారిపోయారు. భర్త, పిల్లలే ప్రపంచంగా బ్రతికేస్తున్నారు. నమ్రతా, శిల్పా ఈ తరం భార్యలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నమ్రత అయితే మహేష్ ఆంతరంగిక సలహాదారుగా మారిపోయారు. ఆయన సక్సెస్ లో పాలుపంచుకుంటున్నారు.