MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లాక్ చేసేలా మహేష్ బాబు లేటెస్ట్ లుక్.. రాజమౌళి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు!

మైండ్ బ్లాక్ చేసేలా మహేష్ బాబు లేటెస్ట్ లుక్.. రాజమౌళి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు!

మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. ఆయన ఈ చిత్రంలోని మహేష్ లుక్ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మేకోవర్ ప్రాసెస్ లో ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 12 2024, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కెరీర్లో మొదటిసారి రాజమౌళితో చేతులు కలుపుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిజానికి బాహుబలి కి ముందే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సింది అట. నిర్మాత కే ఎల్ నారాయణ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న రాజమౌళి ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ కావడం వలన ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు రాజమౌళి-మహేష్ కాంబో సెట్ అయ్యింది. ఇది పాన్ వరల్డ్ మూవీ. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందట. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Mahesh Babu and Rajamouli

Mahesh Babu and Rajamouli

ఇక తన హీరోలను గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయడం రాజమౌళికి అలవాటు. ఈ మధ్య కచ్చితంగా సిక్స్ ప్యాక్ చేయాలి, చొక్కాలు విప్పాలి అంటున్నాడు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ షర్ట్ లేకుండా కనిపించారు. మహేష్ బాబు ఇంత వరకు షర్ట్ విప్పింది లేదు. ఆయన కట్ బనియన్స్ లో కనిపించారు కానీ బేర్ బాడీని ఎన్నడూ ప్రజెంట్ చేయలేదు. 

35
Mahesh Babu and Rajamouli

Mahesh Babu and Rajamouli

ఈసారి మహేష్ కి తప్పేలా లేదు. రాజమౌళి ప్రతి చిన్న విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయన చెప్పినట్లు ప్రతి ఒక్కరూ చేయాలి అంటాడు. రాజమౌళి చిత్రంలోని పాత్ర కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. ఆయన జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉందని సమాచారం. మహేష్ బాబు జుట్టు పెంచడం మరొక ఆసక్తికర పరిణామం. 


 

45
Mahesh Babu

Mahesh Babu

గతంలో మహేష్ బాబు పోకిరి, అతిథి చిత్రాల్లో పొడవైన జుట్టుతో కనిపించారు. ఈసారి ఆ రెండు చిత్రాల రికార్డ్స్ మహేష్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. ఆయన హిప్పీ చాలా పొడవుగా పెంచాడు. గడ్డం కూడా పెంచడం అనూహ్య పరిణామం. మహేష్ బాబు మీసాలు, గడ్డాలు ఉంచరు. టక్కర దొంగ మూవీలో లైట్ గా గడ్డంతో కనిపించాడు. తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు ముంబై వెళ్లారు. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మహేష్, నమ్రత, సితార వెళ్లడమైంది. 

55
Mahesh Babu and Rajamouli

Mahesh Babu and Rajamouli


ఎయిర్ పోర్ట్ లో మహేష్ ని మీడియా కెమెరాలో బంధించింది. మహేష్ లుక్ షాక్ ఇస్తుంది. హాలీవుడ్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా మహేష్ బాబు ఉన్నారు. మరోవైపు ఆరు నెలలుగా మహేష్ ఖాళీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి రాజమౌళి ఎప్పుడు చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా అని టాలీవుడ్ వర్గాలు చూస్తున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Recommended image2
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image3
Kodali Nani: ఎన్టీఆర్ బర్త్ డే వేళ.. కొడాలి నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved