వినాయక చవితి వేళ పట్టు పరికిణీలో బుట్టబొమ్మలా మహేష్ బాబు కూతురు సితార.. ఫెస్టివల్ లుక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పట్టు పరికిణిలో బుట్ట బొమ్మలా మెరిసింది. వినాయక చవితి సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sitara Ghattamaneni
సితార ఘట్టమనేని వినాయక చవితి పండుగను గొప్పగా జరుపుకుంది. పట్టు పరికిణి ధరించి సంప్రదాయబద్ధంగా తయారైంది. మట్టి వినాయకుడికి ఇంట్లో పూజలు నిర్వహించింది.
Sitara Ghattamaneni
సితార తన అభిమానులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. అభిమానులు సైతం తిరిగి ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. సితార పండగ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sitara Ghattamaneni
11 ఏళ్లకే సితార సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. అలాగే సంపాదనలో దూసుకుపోతుంది. ఇటీవల సితార ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది. సితార పీఎంజే జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ ప్రదర్శించారు. ప్రఖ్యాత టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మురిసిపోయారు.
Sitara Ghattamaneni
ఈ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. తన మొదటి సంపాదన ఛారిటీకి డొనేట్ చేసినట్లు సితార వెల్లడించింది. పుట్టినరోజు నాడు పేద బాలికలకు సైకిల్స్ తన సంపాదనతో కొనిపెట్టింది. ఆ బాలికల సమక్షంలో బర్త్ డే జరుపుకుంది. వారితో కాసేపు ముచ్చటించింది.
ఇక సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు.
యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు.
సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు.