ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ చూసిన చిరంజీవి రియాక్షన్ ఇదే... జూనియర్ గురించి అలా అన్నారా!
జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ చూసిన చిరంజీవి రియాక్షన్ ఏమిటో బయటపెట్టారు ఓ దర్శకుడు. మెగా, నందమూరి కుటుంబాల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న నేపథ్యంలో ఆయన ఏమన్నారనేది ఆసక్తికరంగా మారింది.

Adhurs Movie
నందమూరి-మెగా ఫ్యామిలీ మధ్య ఫ్యాన్ వార్ ఉంది. దశాబ్దాలుగా కొనసాగుతుంది. స్టార్ గా ఎదిగిన చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఇక చిరంజీవికి కొంతలో కొంత బాలయ్య పోటీ ఇవ్వగలిగాడు. మరోవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ స్టార్ అయ్యాడు.
బాలకృష్ణ తర్వాత మెగా హీరోలకు పోటీ ఇవ్వగలిగే హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎదిగాడు. టీనేజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అనతికాలంలో స్టార్ అయ్యాడు. ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ ఎన్టీఆర్ ని స్టార్ హీరోల జాబితాలో చేర్చాయి. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్, చరణ్ కూడా స్టార్స్ హోదా తెచ్చుకున్నారు.
NTR Allu Arjun
మెగా ఫ్యామిలీలో చిరంజీవితో కలుపుకుని నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీలో మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ కుటుంబాల మధ్య ఫ్యాన్ వార్ ఉన్నప్పటికీ హీరోల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
Bala Ramayanam
కాగా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని అందరి కంటే ముందు చిరంజీవి అంచనా వేశాడట. అది కూడా ఎన్టీఆర్ బాల్యంలోనే. దర్శకుడు గుణశేఖర్-చిరంజీవి కాంబోలో వచ్చిన చూడాలని ఉంది బ్లాక్ బస్టర్. ఈ చిత్రానికి ముందు గుణశేఖర్ బాలుడిగా ఉన్న ఎన్టీఆర్ తో బాలరామయణం తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి చూశాడట.
NTR - Chiranjeevi
చూడాలనివుంది స్క్రిప్ట్ చెప్పేందుకు చిరంజీవి నివాసానికి వెళ్లిన గుణశేఖర్ తో చిరంజీవి బాలరామాయణం గురించి మాట్లాడాడట. ఆ చిత్రంలో రాముడు పాత్ర చేసిన కుర్రాడు స్టార్ హీరో అవుతాడని చిరంజీవి అన్నారట. ఆయన అంచనాలు తప్పకుండా బాలరామాయణంలో రాముడిగా చేసిన ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ పై మొదటి నుండి నందమూరి ఫ్యామిలీలో వ్యతిరేకత ఉందనే వాదన ఉంది. హరికృష్ణ రెండో భార్యకు పుట్టిన ఎన్టీఆర్ ని వారు వారసుడిగా భావించలేదని కొందరి భావన. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కూడా జరిగాయట. స్టార్ గా ఎదుగుతున్న ఎన్టీఆర్ కి పోటీగా తారకరత్నను తెరపైకి తెచ్చి 9 సినిమాలు లాంచ్ చేయించారని అంటారు.
ఒక దశలో ఎన్టీఆర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకూడదని బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్స్ పై ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఇక ఇటీవల జరిగిన పరిణామాలతో బాలకృష్ణ-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడి పరిస్థితి. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించిన విషయం తెలిసిందే..